మీరు ఇచ్చే రక్తం – మరొకరికి జీవితం.. టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి పట్టణంలో గల ఆర్కే డిగ్రీ & పీజీ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో రక్తదాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి మోతె రాజారెడ్డి టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు 26 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా కామరెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పూలబొకే,శాలువా,మెడల్ తో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ మనమిచ్చే రక్తం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందని దేశంలో ఆరోగ్యవంతమైన వారు సగటున రెండు శాతం మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారని దానివలన ఎంతో మంది రక్తము దొరకక చనిపోతున్నారని ప్రతి రెండు సెకండ్లకు ఒక్కరికి రక్తం అవసరం ఉన్నందున ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి 20 నుంచి 60 సంవత్సరాల వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కృత్రిమంగా సృష్టించే అవకాశం లేనిది,తప్పనిసరిగా అవసరమయినది రక్తం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు డాక్టర్ బాలు,వేద ప్రకాశ్, జమిల్, రమణ, ఆర్కే కళాశాలల చైర్మన్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
గోపీచంద్ మలినేని జాట్ తెలుగు వెర్షన్ ఆలస్యం కానుందా.. అసలు కారణాలు ఇవేనా?