జనసేన సత్తా తెలిసిందోచ్ ! బీజేపీ త్యాగం చేసేనా ?
TeluguStop.com
బీజేపీ జనసేన పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకుని అధికారం సాధించే దిశగా ఏపీలో అడుగులు వేస్తున్నాయి.
కానీ జనసేన విషయంలో బీజేపీ వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉందని, ఆ పార్టీ ని పెద్దగా పట్టించుకోనట్టు గా బీజేపీ అగ్రనేతల దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకులు వరకు వ్యవహరిస్తుండడం, కేవలం బీజేపీ ని గెలిపించేందుకు మాత్రమే జనసేన పార్టీ అవసరం ఉంది తప్ప, జనసేన కోసం త్యాగం చేసే పరిస్థితి లేదు అనే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
అయినా ఎప్పటికప్పుడు పవన్ వాటిని పట్టించుకోకుండానే బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్నారు.అలాగే బీజేపీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు.
రాజకీయంగా ఇవన్నీ జనసేన కు , పవన్ కు వ్యక్తిగత ఇమేజ్ కు డామేజ్ చేసేవే అయినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పవన్ ఈ త్యాగాలకు సిద్ధమయ్యారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, త్వరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు అటు బీజేపీ , ఇటు జనసేన పార్టీలు రెండూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎవరికి వారు సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. """/"/
గతంలో తాము చేసిన త్యాగాలు అన్నిటినీ గుర్తించి, బీజేపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో జనసేన కు పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది అనే అభిప్రాయంలో జనసేన ఉండగా, బీజేపీ మాత్రం జనసేన సహకారంతో తిరుపతి లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారు అంటూ ప్రకటించింది.
ఒకరకంగా ఇది పవన్ ను అవమానించడమే అని జన సైనికులు అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలనే తీసుకుంటే , మొదటి విడత ఎన్నికలలో జనసేన సత్తా చాటుకుంది.
దాదాపు 28 సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుని బిజెపి కంటే తామే బలవంతులు అనే విషయాన్ని రుజువు చేసుకున్నారు.
బీజేపీ మొదటి విడత ఎన్నికల్లో ఎక్కడ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.దీంతో జాతీయ పార్టీగా ఉన్న బిజెపి కంటే జనసేన పార్టీనే బెటర్ అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది.
తిరుపతి లోక్ సభ పరిధిలో చూసుకున్నా, బీజేపి కంటే జనసేన పార్టీ బలం ఎక్కువగా కనిపిస్తోంది.
జనసేన సత్తా బిజెపి కి ఇప్పుడు బాగా అర్థమైన నేపథ్యంలో, జనసేన కోసం బీజేపీ తిరుపతి లోక్ సభ సీటుని త్యాగం చేస్తున్నా, ఎప్పటిలాగే జనసేన ను బుజ్జగించి తిరుపతిలోనూ బీజేపీనే పోటీకి దిగి బొక్క బోర్లా పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
నేనెందుకు పట్టించుకోవాలి… షర్మిల వివాదంపై బాలయ్య కామెంట్స్ వైరల్!