'భీమ్లా నాయక్ ' కోసం టీఆర్ఎస్ ప్లాన్ ఇదా ?
TeluguStop.com
తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు ఎవరికి అర్థం కావు.సమయానుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమకు రాజకీయ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటాయి.
ఇక 2024 ఎన్నికలను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.బీజేపీకి అవకాశం దక్కకుండా చేసి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది.
దీని కోసం రకరకాల ఎత్తుగడలను అమలు చేస్తోంది.రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ పెరగకుండా ఉంచేందుకు ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టిఆర్ఎస్ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కొన్ని కొన్ని వ్యవహారాలు చూస్తే అర్థం అవుతోంది.
ఏపీలో జనసేన - బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.తెలంగాణలో పొత్తు లేకపోయినా, బీజేపీ కి మద్దతు దక్కకుండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతుగా పవన్ కూడా ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
అవసరమైతే కొన్ని స్థానాలు జనసేన కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు.అయితే బీజేపీ జనసేన కాంబినేషన్ ఎంతో కొంత తమకు ఇబ్బంది అవుతుంది అని భావిస్తున్న టిఆర్ఎస్ పవన్ ని బీజేపీ కి దూరం చేసే ప్లాన్ చేస్తోంది .
ఈ నేపథ్యంలోనే పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలబడుతోంది.
కెసిఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ తను బిజీ షెడ్యూల్ లో ఉన్న దాన్ని పక్కన పెట్టి నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.
"""/"/
అలాగే ఈ సినిమా రెండు వారాల పాటు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
దీంతో సహజంగానే జనసేన పార్టీ నాయకులు, పవన్ అభిమానుల్లోనూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై సానుకూలత ఏర్పడింది.
అయితే ఎన్నికల సమయం నాటికి ఏదో రకంగా బీజేపీకి పవన్ ను దూరంచేసి తమకు అనుకూలంగా ఉండేలా చేసుకునేందుకు టిఆర్ఎస్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
1984 సిక్కు అల్లర్లపై తీర్మానం .. అడ్డుకున్న భారత సంతతి ఎంపీ, ఖలిస్తానీయుల బెదిరింపులు