ప్రేమించిన పాపానికి పుట్టినరోజే చివరి రోజయ్యింది

తమ కన్నా బిడ్డను కంటిపాపలా చూసుకోవాల్సిన ఆ తల్లితండ్రులు కాటికి పంపారు.ఇటీవల మిర్యాలగూడ, హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు మరిచిపోకముందే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది.

తమ కులం కానీ వ్యక్తిని ప్రేమించిందని వెనుకాముందు చూడకుండా తమ కుమార్తె ప్రాణాలు తీసిన సంఘటన మహారాష్ట్రలోని మాలేగాంలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే మాలేగాంలోని ఇంద్రాణి కాలనీ నివాసం ఉంటున్న శరద్, సుమితా దంపతులు తమ కూతురురైన 18 ఏళ్ల నేహాను హత్య చేశారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ మధ్యే నేహా పుట్టినరోజు వచ్చింది మరో కులానికి చెందిన తన ప్రేమికుడితో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఇంటికి వచ్చింది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.ఆమెకు తెలియకుండా ఆహారంలో నిద్రమాత్రలు కలిపారు.

అనంతరం ఆమె సృహ కోల్పోవడంతో గొంతు నుమిలి చంపేశారు శరద్, సుమితా.ఆ తర్వాత నేహా మృతదేహాన్ని పూడ్చేందుకు శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు.

సమాచారం అందుకున్న పోలీసులు.శ్మశానవాటికకు చేరుకుని నేహా మృతదేహానికి పోస్టుమార్టం చేయించి హత్యగా తేల్చారు.

తామే హత్యచేసినట్టు నేహాను తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.