గాలిలో ఎగిరే బైక్.. వచ్చే ఏడాదే మార్కెట్‌ లోకి...!?

ఆకాశంలో పక్షులను చూస్తే అప్పుడప్పుడు మనకి వాటిలా గాల్లో ఎగిరిపోవాలనిపిస్తుంటది.ఏ అడ్డు అదుపు లేకుండా ఎక్కడికైనా రై.

రై.మంటూ దూసుకు పోవాలనిపిస్తుంటది.

ప్రస్తుత రోడ్లపైన ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు.ఒక్కోచోట ట్రాఫిక్ జామ్ అయితే రోజుల తరబడి అక్కడే ఉండిపోవలసి వస్తుంది.

ఇక అక్కడ వారి బాధలు చెప్పనక్కరలేదు.ఇంతటి బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు గమ్యాలను త్వరగా చేరుకోవాలనుకుంటారు.

అలాంటి వారికికోసం రై.రై.

మంటూ దూసుకుపోయేందుకు గాలిలో ఎగిరే బైక్ ఒకటి వచ్చేసింది.అమెరికాకు చెందిన ఒక సంస్థ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది.

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హోవర్ బైక్.దీని పేరు ఎక్స్‌టీయూఆర్ఐఎస్‌ఎమ్ఓ.

ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన నార్త్ అమెరికన్ ఆటో షోలో ఈ బైకును ఆ సంస్థ ప్రదర్శించింది.

ఈ హోవర్ బైక్ 40 నిమిషాలపాటు గాల్లో ఎగరగలిగే సామర్ధ్యం కలిగి ఉంది.

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.ఈ బైకు పై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు.

వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుంది.కంపెనీ చెబుతున్న దాని ప్రకారం.

ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.మన కరెన్సీలో దాదాపు రూ.

6 కోట్లకు పైనే ధర ఉండొచ్చు.కానీ, 2025కల్లా ధర తగ్గుతుందని కంపెనీ చెబుతోంది.

ఈ బైక్‌ను అమెరికా ప్రభుత్వం నాన్-ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్‌ గా పరిగణిస్తుందని కంపెనీ భావిస్తోంది.

ధర ఎంత ఉన్నా ధనవంతులు అయితే చాలు.ఆకాశంలో దూసుకుపోవాలనుకునే వారి కోరికకు ఇలాంటి బైక్ లు అనువుగా ఉంటాయి.

అయితే దానికి ట్రైనింగ్ లాంటిది ఏదైనా ఉంటుందో లేదో తెలియదు.అనుభవం లేకుండా ఆకాశంలో విహరించేందుకు బండ్లు కొనుక్కుని ప్రయత్నిస్తే తరువాత వారి పరిస్థితి ఏంటో మరి.

ఏది ఏమయినా ఆ బైక్ ధర చూస్తే సామాన్యులకు దరి చేరని ఆకాశ ఫలమే.

ఈ న్యాచురల్ సీరంను వాడితే హెయిర్ ఫాల్ తో పాటు చుండ్రు కూడా పరార్ అవుతుంది!