Allu Arjun : నా ముందు అల్లు అర్జున్ పొట్టోడు అంటూ బన్నీని అవమానించిన బిగ్ బాస్ నటి.. ఎవరంటే..?
TeluguStop.com
నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ( Allu Arjun ) ని ఒక బిగ్ బాస్ నటి చాలా దారుణంగా అవమానించింది అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇక ఆమె స్టార్ హీరోయిన్ కూడా కాదు.ఒక మామూలు ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
ఇక అంతకుముందు కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ అవి వర్కౌట్ అవ్వలేదు.
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ( Biggboss 7 ) తెలుగు సీజన్ సెవెన్ లో కొనసాగుతుంది.
ఇక ఆమె ఎవరో మీ అందరికీ గుర్తుకొచ్చే ఉంటుంది.ఆమెనే అశ్విని శ్రీ.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక కి అక్క పాత్రలో చేసిన నటి.
అయితే బిగ్ బాస్ కి వెళ్లక ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అల్లు అర్జున్ ని అవమానిస్తూ మాట్లాడింది.
"""/" /
అశ్విని శ్రీ ( Ashwini Sri ) కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ సక్సెస్ కాకపోవడంతో ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.
సపోర్ట్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో కొనసాగుతుంది.అయితే ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
నాకు స్టార్ హీరోల సినిమాల్లో వారి పక్కన ఐటెం సాంగ్స్ చేయాలనే ఒక కోరిక ఉంది.
ఇక నా హైట్ కి ప్రభాస్ ( Prabhas ) అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు.
కానీ అల్లు అర్జున్ నా పక్కన చేయాలంటే స్టాండ్ వేసుకొని చేయాల్సి వస్తుంది అంటూ అల్లు అర్జున్ ని తీవ్రంగా అవమానించింది.
"""/" / అయితే అశ్విని సరదాగా మాట్లాడినప్పటికీ నేషనల్ అవార్డు విన్నయినా అల్లు అర్జున్ ని పరోక్షంగా పొట్టోడు అని తన మాటలతో కించపరుస్తుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
అయితే ఈ విషయంలో అశ్విని ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తూనే ఖచ్చితంగా మా హీరోకి కచ్చితంగా సారీ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం అశ్విని శ్రీ బిగ్ బాస్ లో ఉండడం వల్ల అది కుదరదు.
ఇక బయటికి వచ్చాక అశ్విని శ్రీ ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.
వావ్.. ఇది కదా అసలైన రోహిత్ శర్మ.. హృదయాలను గెలుచుకున్నాడుగా