ఆ పోరాటాలు చేయ‌క‌పోవ‌డ‌మే టీడీపీకి పెద్ద మైన‌స్‌..

రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాలంటే ఎప్పుడూ వాయిస్ బ‌లంగానే వినిపించాలి.లేదంటే ప్ర‌జ‌ల్లో కూడా క‌నుమ‌రుగైపోతారు.

ఎంత‌టి ఫైర్ బ్రాండ్ నేత‌లు అయినా స‌రే నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉంటూనే త‌మ వాయిస్‌, పోరాటాల‌తోనే మ‌నుగ‌డ సాధ్యం అవుతుంది.

లేదంటే మాత్రం వారిని ప్ర‌జ‌లు కూడా మ‌ర్చిపోతుంటారు.ఈ విష‌యాన్ని టీడీపీ ఎందుకో ప‌క్క‌న పెట్టేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఓ వైపు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే త‌మ మాట‌ల దాడితో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే టీడీపీ మాత్రం మిన్న‌కుండిపోతోంది.

నిజానికి టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయానా కూడా రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌యం కేవ‌లం మాట‌ల్లోనే వినిపిస్తోంది.

అంతే గానీ చేత‌ల్లో మాత్రం ఎలాంటి రియాక్ష‌న్ చూపించ‌ట్లేదు.పోని ఆ త‌ర్వాత అయినా పుంజుకుని పోరాటాల దిశ‌గా అడుగులు వేస్తే ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునేదేమో.

కానీ అలా కాకుండా సైలెంట్‌గా ఉండిపోవ‌డంతో అది వైసీపీ గెలుపుకు పునాది అయిపోయింది.

ఇంత జ‌రిగినా కానీ టీడీపీ మాత్రం రాబోయే ఎన్నిక‌ల్లో తామే గెలుస్తామంటూ చెబుతోంది త‌ప్ప ఆ మేర‌కు కృషి మాత్రం చేయ‌ట్లేదు.

"""/"/ ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసిన‌ప్పుడే ఎవ‌రైనా ప్ర‌జ‌ల్లో నానుతారు.అలాంటి వారి గురించే మీడియా కూడా చ‌ర్చిస్తుంది.

ఇవ‌న్నీ జ‌రిగిన‌ప్పుడే ప్ర‌జ‌ల మైండ్‌లోకి ఆ నేత‌లు వెళ్తార‌న్న విష‌యం రాజ‌కీయ కురువృద్ధులు ఉన్న టీడీపీకి తెలియ‌నిది కాదు.

కానీ ఎక్క‌డా కూడా ప్ర‌జాస్వామ్య యుతంగా పోరాటాలు చేయకపోవడమే చంద్ర‌బాబు పార్టీకి పెద్ద వీక్ పాయింట్‌.

ఈ వీక్ పాయింట్‌ను పట్టుకుని వైసీపీ ట్రెండ్ సెట్ చేస్తోంది.ఆ ట్రెండ్‌ను టీడీపీ ఫాలో అవుతోంది.

ఎంత సేపు త‌మ‌కు అనుకూలంగా ఉన్న మీడియాను న‌మ్మ‌కుని ప్రెస్ మీట్ల వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు టీడీపీ నేత‌లు.

అలా కాకుండా ఒక్కో అంశాన్ని హైలెట్ చేస్తూ దానిపై పోరాటాలు చేస్తేనే పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఐపిఎల్ ఈ సీజన్ ముగిసే సమయానికి టాప్ హిట్టర్లుగా నిలిచే ప్లేయర్లు ఎవరంటే..?