నేత‌ల‌ను కాపాడుకోవ‌డమే చంద్ర‌బాబుకు పెద్ద స‌వాల్‌.. ఇది

2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ప్రస్తుతం అతి పెద్ద సమస్య వచ్చి పడింది.

దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలనే విషయం ఏ మాత్రం అర్థం కావడం లేదని అందరూ అంటున్నారు.

ఇన్నాళ్లూ బీజేపీతో పొత్తు పెట్టుకుందామని అనుకున్న చంద్రబాబుకు మొన్న తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షా పెద్ద షాక్ ఇచ్చారు.

ఇక బీజేపీతో పొత్తు మాట మంట గలిసినట్లే అని అంతా అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే తన సొంత పార్టీ నేతలను ఆయన కాపాడుకోవడం చంద్రబాబుకు అతి పెద్ద తలనొప్పిగా మారింది.

ఇప్పటి వరకూ చంద్రబాబు టీడీపీని బలోపేతం చేయడంపైనే కాన్సంట్రేట్ చేశారు.అధికార వైసీపీని చంద్రబాబు టార్గెట్ చేస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.అసలు పార్టీలో ఉన్న నేతలు ఎవరికి తోచిన విధంగా వారు వేర్వేరు పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.

దీంతో అధినేతకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. """/"/ ఇక ఇటీవలే తిరుపతికి వచ్చిన అమిత్ షా టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు మనకు శత్రువులే అని ఆయన చెప్పారు.

ఇక ఆపరేషన్ ఆకర్ష్ను బలోపేతం చేయాలని పార్టీ నేతకు ఆయన సూచించారు.వీలయినంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవాలని సూచించారు.

అధికార వైసీపీ నేతలు ఎవరూ బీజేపీలో చేరరు? కానీ కేవలం టీడీపీ నాయకులు మాత్రమే బీజేపీలో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారని అందరూ భావిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఉంది కాబట్టి బీజేపీ నాయకులు పెద్దగా ఆ పార్టీ మీద ఫోకస్ చేయరు.

కానీ వారు ఎక్కువగా టీడీపీ మీదే ఫోకస్ చేసి అందులో ఉన్న ముఖ్యమైన నేతలకు కమలం కండువా కప్పేందుకు చూస్తారు.

మరి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలను కోడిపిల్లల్లా కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

వీడియో: ఎయిర్‌పోర్ట్‌లో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు.. జవాన్ ఎంట్రీ ఇవ్వడంతో..?