ది బిగ్ బుల్ సినిమా ఇలియానా ఫస్ట్ లుక్ విడుదల..!
TeluguStop.com

దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మది గెలుచుకుంది గోవా బ్యూటీ.ఈ సినిమాలో ఇలియానా తన అంద చందాలతో కుర్రకారులకు మతి పోగ్గోటింది ఇలియానా.


ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు రావడంతో మహేష్, పూరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాతో ఈ అమ్మడుకి స్టార్ డాం తీసుకొచ్చింది.


ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు దక్కడంతో వరస అవకాశాలను అందుకొని పెద్ద హీరోల సరసన నటించింది.
ఇలియానా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవూడ్ లోను తెరంగ్రేటం చేసింది.ఈ అమ్మడు హిందీల సినిమాల్లోనూ నటించారు.
అయితే కొంత కాలం గడిచిన తర్వాత టాలీవూడ్, బాలీవూడ్ లో ఆమెకు ఆఫర్స్ రాకపోవడంతో కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
ఇలియానా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ సినిమా అనుకున్నంత మంచి ఫలితాన్ని అందించలేదు.దీంతో ఈ భామకు అవకాశాలు కరువైయ్యాయి.
అయితే చాల రోజుల తర్వాత ఆమె మళ్ళి తెలుగు సినిమాకు సంతకం పెట్టారని సమాచారం.
అయితే హీరో నాగార్జునగా వస్తున్నా సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటిస్తారని సమాచారం.
అయితే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాలోనే ఇలియానా హీరోయిన్‌గా నటించనున్నారు.
ఈ సినిమాకి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని చిత్రబృందం పరిశీలిస్తుందని సమాచారం.
ప్రస్తుతం ఇలియానా హిందీలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్ బుల్ అనే సినిమాలో నటిస్తున్నారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో క్రైం డ్రామాగా చిత్రం నిర్మిస్తున్నారు.
అయితే చిత్రానికి సంబంధించిన ఇలియానా లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఆ పోస్టర్ లో ఇలియానా ఎదో దీర్ఘాంగా ఆలోచిస్తున్నట్లు కనపడుతుంది.ఈ మూవీకి కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.
అజయ్ దేవ్‌గన్, ఆనంద్ పండిట్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.