బోయపాటి, రామ్ సినిమాలో వచ్చిన వీడియో లోని బిజీఎం ఈ సినిమాలోనిదే…

బోయపాటి శీను బాలయ్య( Boyapati Srinu,Balayya ) కాంబో లో వచ్చిన అఖండ ( Akhanda )కి ముందు రాంచరణ్( Ramcharan ) తో ‘వినయ విధేయ రామ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu ), ఈ సినిమా అతని కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గరనుండి ఆ సినిమాకి బోయపాటి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

ఆ సినిమా నిరాశపరచడంతో.యంగ్ హీరోలు సైతం బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి భయపడ్డారు.

అయితే బాలయ్యతో ‘అఖండ’ చేసి ఆ విమర్శలకు చెక్ పెట్టాడు బోయపాటి. """/" / అఖండ’ విషయంలో బోయపాటి శ్రీను ఎటువంటి హడావిడి చేయలేదు.

మొత్తం ఆ సినిమా కంటెంట్ మాట్లాడింది అని చెప్పవచ్చు.బాలయ్య పుట్టినరోజుకి గ్లింప్స్ ను వదిలాడు కానీ.

టైటిల్ అనౌన్స్ చేయలేదు.ఇప్పుడు రామ్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు బోయపాటి.

‘బోయపాటి -రాపో’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ గ్లింప్స్ ను రామ్ పుట్టినరోజు కానుకగా వదిలాడు బోయపాటి.

‘బోయపాటి -రాపో’ ఫస్ట్ థండర్ అంటూ వచ్చిన ఈ గ్లింప్స్.మాస్ అభిమానులకు ముఖ్యంగా రామ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి.

"""/" / ఈ టీజర్లో నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో రామ్ కనిపిస్తున్నాడు.

నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా… నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్…అనే డైలాగ్ హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

ఈ టీజర్లో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించింది.తమన్ సంగీత దర్శకుడు.

ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంతకు ముందు ఆయన చేసిన సినిమా అయిన రగడ సినిమాలో మ్యూజిక్ లాగానే అనిపించింది మీరు ఇది గమనించారా.

ఇక ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ మూవీ.

ప్రస్తుతం రామ్ ఆశలు మొత్తం ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు.

రెడ్ టవల్ తో బాబాయ్ ను గుర్తు చేసిన రామ్ చరణ్.. హైప్ భారీగా పెంచేశాడుగా!