లవంగాల సాగులో మేలైన సస్యరక్షణ పద్ధతులు..!

లవంగాలను( Cloves ) రుచి కోసం దాదాపుగా అన్ని రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు.

అంతే కాదు కొన్ని రకాల సబ్బులు, పెర్ఫ్యూమ్ లలో లవంగాల ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి లవంగాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.భారతదేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రలలో అధిక విస్తీర్ణంలో లవంగాల పంట సాగు( Cultivation Of Cloves ) అవుతోంది.

సాధారణంగా లవంగాలలో సికోటిక్, జంజిబర్, సిహుట్టిన్( Sycotic, Zanzibar, Sihuttin ) అనే మూడు జాతులు ఉన్నాయి.

ఈ మూడు జాతులలో రంగు, రుచి, పరిమాణంలో చాలా వ్యత్యాసం ఉంది.లవంగాలు సాగు చేయాలంటే ఉష్ణోగ్రత పరిస్థితులను బట్టి రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

భారతదేశంలో లవంగాల సాగు చేయాలంటే బర్లియర్ నెం.1 ఎస్టేట్, ఒడెథం ఎస్టేట్ అనే రకాలు అనుకూలంగా ఉంటాయి.

"""/" / అధిక తేమ ఉండి, 20 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తడి, పొడి వాతావరణం మారుతూ ఉంటే మొక్కలు తొందరగా పెరుగుతాయి.సారవంతమైన గడప నేలలలో నారుమడులు ఏర్పాటు చేసి ఓ 18 నెలలు నారు పెంచాలి.

పంట పొలంలో వరుసల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.మొక్కలు వాడిపోకుండా నీటి తడులను అందిస్తూ ఉండాలి.

రసాయన ఎరువుల వాడకం తగ్గించి.పశువుల ఎరువులు, వర్మి కంపోస్ట్ ఎరువులు సమృద్ధిగా అందించి సస్యరక్షక జాగ్రత్తలు పాటించాలి.

"""/" / జంజిబర్ జాతికి చెందిన మొక్కలు ఆరేళ్లకే కోతకు వస్తాయి.ఇక పండించే ప్రదేశ వాతావరణన్ని బట్టి కూడా పంట చేతుకు వచ్చే సమయం ఆధారపడి ఉంటుంది.

మామూలు జాతికి చెందిన మొక్కలు అయితే ఎనిమిది సంవత్సరాల కు కోతకు వస్తాయి.

ఇక అన్ని సస్యరక్షక పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే ఒక్క మొక్క నుంచే దాదాపుగా 40 కిలోల దిగుబడి పొందవచ్చు.

చుండ్రును తరిమికొట్టే దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలో తెలుసా?