చిగుళ్ళు వాచి నొప్పి పుడుతున్నాయా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

చిగుళ్ళ‌ వాపు.దీనినే జింజివైటిస్ అని అంటారు.

దంత సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, క‌ఠిణ‌మైన బ్రెష్‌ల‌ను యూస్ చేయ‌డం, చ‌ల్ల‌టి పానియాల‌ను అధికంగా తీసుకోవ‌డం, చిగుళ్ళ మధ్యన పాచి పేరుకుపోవడం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిగుళ్ల వాపు స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది.

ఇది చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ తీవ్ర‌మైన నొప్పి మ‌రియు అసౌక‌ర్యానికి గురి చేస్తుంది.

ఒక్కోసారి చిగుళ్ళ నుంచి ర‌క్తం కూడా వ‌స్తుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క‌, చిగుళ్ళ వాపును ఎలా త‌గ్గించుకోవాలో అర్థంగాక తెగ స‌త‌మ‌తం అయిపోతుంటారు.

ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను పాటిస్తే చాలా సుల‌భంగా వాచిన చిగుళ్ళను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని పొట్టు తొల‌గించి స‌న్న‌గా తురుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల మీ రెగ్యుల‌ర్ టూత్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్‌ పింక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చిగుళ్ళకు, దంతాల‌కు అప్లై చేసి సున్నితంగా బ్రష్‌ తో తోముకోవాలి.

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. """/" / ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కాను రోజుకు ఒక‌సారి పాటిస్తే చాలా త్వ‌ర‌గా చిగుళ్ళ వాపు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

అలాగే గార‌ప‌ట్టిన ప‌సుపు దంతాలు తెల్లగా కూడా మార‌తాయి.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ట్రై చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

విశ్వంభర లో త్రిష రోల్ ఏంటో తెలుసా..?