బీజేపీ అంతానికి నాంది..: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఇది బీజేపీ అంతానికి నాందని ధ్వజమెత్తారు.తనను బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.

ఈ లోక్ సభ పార్లమెంటరీ కమిటీని ఆయుధంగా మార్చిందన్న ఆమె ఎథిక్స్ కమిటీ దుర్వినియోగం అయిందని మండిపడ్డారు.

అయితే ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ నివేదికను రూపొందించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎథిక్స్ కమిటీ రిపోర్టు మేరకు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

హ‌లో అబ్బాయిలు.. ద‌ట్ట‌మైన గ‌డ్డాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకే!