ఉత్సాహంగా బెలూన్ ఫెస్టివ‌ల్‌... సంద‌డి చేస్తున్న జ‌నం... ఎక్క‌డంటే..

త‌మిళ‌నాడుతోని కోయంబత్తూరులోగ‌ల పొల్లాచ్చిలో ప్రజల ఉత్సాహాల మ‌ధ్య‌ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది.తొలిసారిగా తమిళనాడు టూరిజం శాఖ ప్రైవేట్ రంగ సహకారంతో ఈ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

పొల్లాచ్చిలో శుక్ర‌వారం ప్రారంభమైన బెలూన్ ఫెస్టివల్ 15వ తేదీ వరకు కొనసాగనుంది.ఉదయం 6.

30 గంటల నుంచి బెలూన్‌లు ఎగ‌ర‌డం మొద‌ల‌య్యింది.ఈ బెలూన్ ఫెస్టివల్‌లో నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, కెనడా సహా 8 దేశాల నుంచి తీసుకొచ్చిన పది హాట్ ఎయిర్ బెలూన్‌లను ఎగురవేస్తున్నారు.

దాదాపు 60 అడుగుల నుంచి 100 అడుగుల ఎత్తులో ఉండే ఈ బెలూన్లను ఈ ఫెస్టివల్‌లో అద్భుతంగా ఎగురవేస్తారు.

పిల్లలను ఆకర్షించేందుకు మిక్కీ మౌస్, డైనోసార్ సహా వివిధ ఆకారాల్లోని బెలూన్‌లను కూడా ఎగుర వేశారు.

"""/"/ ఈ ఉత్సవాల్లో తమిళనాడు టూరిజం శాఖ తరపున బెలూన్ కూడా ఎగురవేశారు.

ఈ ఫెస్టివల్‌లో కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ సమీరన్ బెలూన్ ఎగిరే కార్యక్రమాలను చూసేందుకు ఉదయాన్నే పొల్లాచ్చికి వచ్చారు.

ప్రపంచం నలుమూలల నుంచి బెలూన్లు, సెయిలర్లు వస్తున్నారని, 8 దేశాల నుంచి తెప్పించిన 10 బెలూన్లను ఎగురవేశామని ఆయ‌న తెలిపారు.

ఈ బెలూన్ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన కోసమేనని, ఇది తమిళనాడు ప్రభుత్వ టూరిజం శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం అని తెలిపారు.

తమిళనాడు నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది ఇక్క‌డికి తరలివచ్చారు.

"""/"/ తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలను వివరించేందుకు కళాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.పొల్లాచ్చి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని, వివిధ ప్రాంతాలను పరిశీలించి పొల్లాచ్చిని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఇక్క‌డ గాలి వేగం సాధారణంగా ఉంటుంద‌ని, సహజ వాతావరణం ఆధారంగా ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలియజేశారు.

అలాగే ఈ బెలూన్ ఫెస్టివల్ ద్వారా కోయంబత్తూరు, పొల్లాచ్చిలోని పర్యాటక ప్రాంతాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తిగా పాల్గొంటున్నారు.ముఖ్యంగా చిన్నారులు బెలూన్‌లను చూసేందుకు ఎంతో ఉత్సాహంతో త‌ర‌లివ‌స్తున్నారు.

ఇలాంటి బెలూన్‌ ఫెస్టివల్‌ను చూడటం ఇదే తొలిసారి అని, చాలా సంతోషంగా ఉందని, ఇది తమ జీవితంలో కొత్త అనుభూతిని కలిగించిందని స్థానికులు తెలిపారు.

ఈ బెలూన్ ఫెస్టివల్ 15వ తేదీ వరకు జరగనుండడంతో ఆ ప్రాంత ప్రజలు బెలూన్లను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.