తుంటరి పని చేసిన కోతి పిల్ల.. షాక్‌ అయిన పోలీసులు

అందరూ కోతి అనగానే తుంటరి పనులకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు.అందుకే పిల్లలను కూడా అల్లరి పనులను చేసినప్పుడు కోతి పనులు చేయొద్దు అంటూ సుతిమెత్తగా హెచ్చరిస్తుంటారు.

మనుషుల సంగతేమో కానీ ఓ కోతి పిల్ల చేసిన పనికి పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఏం జరిగిందోనని, హడావుడిగా వెళ్లిన పోలీసులు షాక్ తిన్నారు.యూఎస్‌లోని కాలిఫోర్నియాలోని పోలీసులకు ఇటీవల స్థానిక జంతుప్రదర్శనశాల (జూ) నుండి 911 ఎమర్జెన్సీ నంబరుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.

ఆ ఫోన్‌ రావడంతో ఏదో జరగకూడనిది జరిగిందనే ఆందోళనతో అక్కడికి వెళ్లారు.తీరా తమకు ఫోన్ చేసింది ఓ కోతి అని తెలిసి అవాక్కయ్యారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.అమెరికాలో 911 నంబరును ఎమర్జెన్సీ కోసం వినియోగిస్తుంటారు.

దానికి ఏదైనా ఫోన్ కాల్ వస్తే క్షణాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు.

తద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడతారు.క్విక్ రెస్పాన్స్ ఉంటుంది.

అయితే ఎమర్జెన్సీ నంబరుకు వచ్చిన ఓ ఫోన్ కాల్ ఇటీవల పోలీసులను కంగారు పెట్టించింది.

అవతలి నుంచి ఎవరూ ఏమీ మాట్లాడకపోవడంతో పోలీసులు ఆందోళన చెందారు.వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆరా తీస్తే, అది ఓ జూ నుంచి వచ్చినట్లు తెలుసుకున్నారు.

అక్కడేవైనా జంతువులు మనుషులపై దాడి చేశాయేమోననే ఊహ మదిలో తట్టగానే పోలీసులు భయపడ్డారు.

దీంతో కొన్ని కార్లలో చాలా వేగంగా అక్కడికి పరుగులు పెట్టారు.తీరా ఆ ఫోన్ పొరపాటుగా వచ్చిందని, ఆ ఫోన్ కాల్ చేసింది కూడా ఓ కోతి అని తేలడంతో విస్మయం వ్యక్తం చేశారు.

జూ ఉద్యోగులు రూట్ అనే కాపుచిన్ రకమైన కోతి చేసిన తప్పుగా పోలీసులకు చెప్పారు.

దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు నవ్వు రప్పించే మీమ్స్‌ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే19, ఆదివారం 2024