దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష తోపాటు రూ.2000 జరిమానా.

రాజన్న సిరిసిల్ల జిల్లా :దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష తోపాటు రూ.

2000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెలువడించారు.

ప్రాసిక్యూషన్ కథనం మేరకు.4 అక్టోబర్ 2016 రోజున ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన తలారి రాజు అదే గ్రామానికి చెందిన జంగ భూంరాజుల మధ్య చెట్లను కొట్టుకునే విషయంలో గొడవ జరిగింది.

ఆ గొడవలో భూంరాజు రాయితో రాజు తలపై కొట్టాడు.తీవ్రంగా గాయపడిన రాజుని వెంటనే దవాఖానకి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

జరిగిన సంఘటనపై ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

ప్రాసిక్యూషన్ తరపున పి.పి.

చెలుమల సందీప్ వాదించగా, సిఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష,2000 జరిమానా విధించారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్…