గ్రామపంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ): గ్రామపంచాయతీ కార్మికులకు నెలల తరబడి రావలసిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని , కనీస వేతనం అమలు చేయాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిరిసిల్ల లోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు.

అనంతరం ఆఫీస్ ఇన్చార్జి ఘనరాజ్ కి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ ( KODAM Ramana ) మాట్లాడుతూ జిల్లాలోని పంచాయితీలలో పనిచేస్తున్న ఉద్యోగ , కార్మికులకు ఒక్కో గ్రామపంచాయతీలో దాదాపు 4 నెలల నుండి 10 నెలల వరకు కూడా జీతాలు బకాయి ఉన్నాయని కార్మికులు వారి కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసలే చాలీచాలని జీతాలతో బతుకుతున్న కార్మికులకు ప్రతినెల జీతాలు ఇవ్వకుండా కార్మికులను ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయని, ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పంచాయతీ కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదని మండిపడ్డారు.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ జీతాలు చెల్లించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత పిఎఫ్,ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని జనాభా ప్రాతిపదికన కార్మికులను నియమించి కార్మికులపై వేధింపులు అక్రమ తొలగింపులు అరికట్టాలని వారాంతపు సెలవులు పండుగ సెలవులు అర్జీత సెలవులు ఇవ్వాలని, తదితర డిమాండ్లు పరిష్కరించేంతవరకు కార్మికులు దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తారని, మార్చి 21న చలో హైదరాబాద్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నాల్దాస్ గణేష్ , లింగంపల్లి కృష్ణవేణి , బుర్ర శ్రీనివాస్ , వర్కోలు మల్లయ్య , శ్రీనివాస్ , నరసయ్య , అంజయ్య , బిక్షపతి , రవీందర్ , నరసయ్య , సురేష్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి కార్మికులు పాల్గొన్నారు.

మతిమరుపే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.. అదెలాగో తెలిస్తే..