జనావాసాల్లోకి వచ్చిన లేడి పిల్ల.. ఆ తర్వాత అది చేసిన పనికి అందరూ షాక్!
TeluguStop.com
సాధారణంగా లేడి లేదా జింక పిల్లలు( Deer Kids ) జనావాసాల్లోకి రావు.
ఒకవేళ పొరపాటున వచ్చినా అవి మనుషులను చూసి భయపడి పోతాయి.అక్కడి నుంచి వాయువేగంతో మాయమవుతాయి.
కానీ ఒక జింక పిల్ల మాత్రం జనావాసాల్లోకి వచ్చి ఎంచక్కా గంతులేసింది.అది చిన్నగా ఉన్నా చాలా ఎత్తుకు ఎగురుతూ హ్యాపీగా రోడ్డుపై తిరిగింది.
"""/" /ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడని స్థానికులు మొదటిసారిగా చూసి అవాక్కయ్యారు.
అక్కడ కుక్కలు ( Dogs )లేదా ఇంకా ఏదైనా మాంసాహారులు ఉంటే జింకని తరమడం ఖాయం.
కానీ అవి ఏమీ తెలియని ఈ జింక హాయిగా రోడ్డుపై గెంతుతూ ఎంజాయ్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.అది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ వీడియోలో వాహనాలు లేని ఒక హై-వే చిన్న జింకపిల్ల చెంగుచెంగున ఎగురుతూ ముందుకు దూసుకెళ్లడం చూడవచ్చు.
ఈ ప్రాంతం ఎక్కడుంది అనేది తెలియ రాలేదు కానీ అక్కడ జనాలు కూడా పెద్దగా కనిపించలేదు వాహనాలు కూడా లేవు.
అందువల్ల అది నడిరోడ్డుపై ఉరుకుతూ కనిపించింది. """/" /అది ధైర్యంగా నడిరోడ్డు పై నడుస్తూ ఉంటే అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు.
తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నామని, ఈ దృశ్యం చాలా అరుదైనదని కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ వీడియోకు ఇప్పటికే మూడు మిలియన్లకు పైగా వ్యూస్, 2 లక్షల వరకు లైకులు వచ్చాయి.
దీన్ని మీరు కూడా చూసేయండి.
వామ్మో.. ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే! (వీడియో)