బైకుపై రెచ్చిపోయిన జంట.. ఎక్కడో కాదండోయ్.. మన హైదరాబాద్‌లోనే..
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో యువత ఆగడాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
యువత ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఇంట్లో వారిని మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న వారిని కూడా అనేక ఇబ్బందుల గురి చేసిన సంఘటనలు చాలానే ఇదివరకు సోషల్ మీడియాలో మనం గమనించాము.
ఇక మరికొందరైతే వాటిని హద్దు మీరుతూ.పబ్లిక్ లో రొమాన్స్ చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు.
రోడ్డుపై బైక్ ప్రేమికులు వెళుతున్న సమయంలో, బస్సు ప్రయాణంలో, రైలు ప్రయాణంలో ఎక్కడపడితే అక్కడ పబ్లిక్ లో ఉన్నమన్న ఆలోచన కూడా లేకుండా మితిమీరి పనులు చేయడం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అయ్యాయి.
ఈ కోవకే తాజాగా హైదరాబాద్ ( Hyderabad )మహానగరంలో బైకుపై ఓ జంట రెచ్చిపోయారు.
అది కూడా పట్టపగలే.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
"""/" /
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పహాడీ షరీఫ్ ( Pahadi Sharif )ప్రధాన రహదారిలో జంట బైకుపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వెళ్లడం సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
చుట్టుపక్కల ఎవరూ లేరు అనుకున్నారో ఏమో కానీ.వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తూ బైకుపై ప్రయాణిస్తున్నారు.
అబ్బాయి బైక్ నడుపుతుండగా అమ్మాయి అబ్బాయి ఒడిలో కూర్చొని హద్దులు దాటి ముద్దులు పెట్టుకుంటూ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది.
అది చూడడానికి పక్కన వెళ్లేవారు కూడా సిగ్గుతో తలదించుకొని వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ ఆ జంటపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
"""/" /
ముఖ్యంగా ఇలాంటి పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ.ఇలాంటి వారిని ఇంటి నుంచి బయటికి పంపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తుండగా.
మరికొందరేమో ఇలాంటి వారి వల్లనే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితికి దిగజారుతుందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరేమో ఇలాంటి చర్యలు మరోసారి నడిరోడ్డుపై జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఉన్న బైక్ నెంబర్ ఆధారంగా సీసీ కెమెరాలు ద్వారా పోలీసులు ఆ జంటను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కూతుర్ని పైలట్‌ను చేసిన తండ్రి.. ఆయన కూడా పైలటే.. ఆమె ఫ్లైట్‌లోనే రిటైర్డ్!