ఆసక్తి పెంచుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. బైడెన్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్( US President Joe Biden ) కీలక ప్రకటన చేశాడు.

రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మరోసారి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.తాజాగా ఏబీసీ న్యూస్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని జో బైడెన్ స్పష్టం చేశాడు.

గతంలో ఆయన భార్య జిల్ బిడెన్( Jill Biden ) కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

అయితే జో బైడెన్ పోటీపై సొంత పార్టీలోనే కొంచెం వ్యతిరేకత ఉంది.బైడెన్ వయస్సు ప్రస్తుతం 80 సంవత్సరాలు.

ఇప్పటికే అత్యధిక వయసు కలిగిన అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోయాడు.2025 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ఆయన గెలిస్తే అప్పటికి ఆయనకు 82 సంవత్సరాలు వస్తాయి.

ఆ వయసులో ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.

"""/" / మరో వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్( Donald ) మాజీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మరోసారి అమెరికా అధ్యక్షుడి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

ఆయన వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు.ఒక వేళ రెండేళ్ల తర్వాత జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఆయన వయసు అప్పటికి 78 సంవత్సరాలు ఉంటుంది.

డొనాల్డ్ ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.దీని తరువాత, ట్రంప్ ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందుల మధ్య మూడవసారి ఎన్నికలలో పోటీ చేయాలని యోచిస్తున్నారు.

ఇటీవలే ఓ పోర్న్ స్టార్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న కేసులో కోర్టులో ఆయన చిక్కులు ఎదుర్కొన్నారు.

"""/" /అయితే దీనిని ప్రతిపక్షాల కుట్రగా ట్రంప్ అభివర్ణించారు.ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటన తర్వాత ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుు విరాళాలు అధిక మొత్తంలో వచ్చాయి.

ఇది శుభపరిణామమని, ప్రజలను తనను ఆమోదిస్తున్నారని ట్రంప్ చెబుతున్నారు.ఇక అధ్యక్షుడు బైడెన్ ప్రస్తుతం 42.

6 శాతం ప్రజల ఆమోదం కలిగి ఉన్నారు.కోవిడ్ -19ని అరికట్టడంలో వైలఫ్యం, ఆర్థిక వ్యవస్థ కోలుకున్నప్పటికీ, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ఇటీవల బ్యాంకులు దివాళా తీస్తుండడం వంటిని ఆయనకు ప్రతికూలంగా మారనున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్3, మంగళవారం2024