ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రోబో వచ్చేసింది.. దీని ఫన్నీ ఎక్స్‌ప్రెషన్లు చూస్తే నవ్వాగదు..!

ప్రపంచంలోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తలలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ టాప్ ప్లేస్ లో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.

క్వాంటం మెకానిక్స్ భాగంలో కూడా ఆయన అందించిన సేవలు మరువలేనివి.అయితే తాజాగా ఒక టెక్నాలజీ కంపెనీ యజమానులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ని పోలిన ఒక రోబోని తయారు చేశారు.

దీని ఫేస్ కి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ముఖాన్ని పోలి ఉన్న ఒక మెటీరియల్ ని అసెంబుల్ చేశారు.

ఈ రోబోకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.'మేక్‌అప్‌షాల్' అనే ఖాతా ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఐన్‌స్టీన్ లాగా కనిపించే ఒక రోబోని చూడొచ్చు.

ముసలి వయసులో ఉన్న ఐన్‌స్టీన్ లాగా ఇది తెల్ల జుట్టుతో ముడతల ముఖంతో కనిపించింది.

అంతే కాదు ఇది తల వూపుతుంది, కనుసైగ చేస్తుంది.అలానే నాలుకతో వెక్కిరిస్తూ వెటకారంగా నవ్వుతుంది.

ఈ రోబో ఫేస్ మాత్రమే కాదు దీని మ్యానరిజం కూడా మనకు ప్రఖ్యాత శాస్త్రవేత్తను గుర్తు చేస్తుంది.

అయితే, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రోబోని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతారు.ముఖ్యంగా దీని ఎక్స్‌ప్రెషన్లు చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

భలే క్యూట్ గా ఉంది అంటూ దీనికి నిక్ నేమ్స్ కూడా పెడుతున్నారు.

ఈ వీడియోకి 60 వేల కంటే ఎక్కువ లైక్‌లు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.