ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే మనందరి లక్ష్యం.
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ అసెంబ్లీ -2023 ఈ నెల 30 వ తేదీన గురువారం రోజున జరుగు ఎన్నికల సందర్భంగా పటిష్ట నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే మనందరి లక్ష్యం అని అధికారులకు,సిబ్బందికి సూచించారు.
ఈరోజు సిరిసిల్ల పట్టణం( Sircilla )లోని కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఎన్నికల రోజు,ఎన్నికల తరువాత పొలీసుల నిర్వహించాల్సిన బందోబస్తు విధులపై ఎస్పీ పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ముఖ్యం ఎన్నికల వేళ రూట్ బందోబస్తు,పోలింగ్ స్టేషన్ బందోబస్తు, పెట్రోలింగ్ పార్టీ పోలీసులు నిర్వహించాల్సిన విధులను తెలియజేశారు.
H3 Class=subheader-styleభద్రతా ఏర్పాట్లు ఇలా/h3p.జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని,జిల్లాలో ఉన్న 560 పోలింగ్ కేంద్రాల్లో సుమారుగా 1700 మందికి పైగా భద్రతా విధులలో పాలుపంచుకోనుండగా ఇందులో ఎస్పీ-01,ఆదనపు ఎస్పీ-01,డీఎస్పీ లు- 05,ఇన్స్పెక్టర్ లు 16,ఎస్.
ఐ లు 34,జిల్లా సిబ్బంది(ఏ.ఎస్.
ఐ టూ హోమ్ గార్డ్ వరకు సివిల్,ఆర్ముడ్ సిబ్బంది ) - 700, కేంద్ర బలగాలు - 480, బెటాలియన్ సిబ్బంది - 42, ఆర్.
పి.ఎఫ్ సిబ్బంది - 52,మహారాష్ట్ర కు చెందిన హోమ్ గార్డ్స్ 450, ప్రత్యేక బృందాలతో కూడిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
అంతే కాకుండా రూట్ మొబైల్స్ - 53, క్విక్ రియాక్షన్ టీమ్స్ ( క్యూఆర్టి)-13, స్ట్రయికింగ్ ఫోర్స్-13, స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ 02 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలింగ్ స్టేషన్ల వద్ద విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి సూచనలుపోలింగ్ స్టేషన్లో ఈవీఎంల( EVMs ) భద్రత ఎన్నికల
సామాగ్రి భద్రతా, పోలింగ్ పూర్తయిన తర్వాత తిరిగి పంపే అంతవరకు అప్రమత్తంగా ఉండాలి, ఆదేశాలు వచ్చేవరకు పోలింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్ళరాదు.
ఉదయం 6 గంటలకు మార్క్ పోలింగ్ ఉన్నందున అధికారులు సిబ్బంది ఆరు గంటల లోపు యూనిఫాంలో విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.
పోలింగ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహించే వారు ప్రిసిడింగ్ అధికారి అనుమతి లేనిది పోలింగ్ కేంద్రంలోనికి వెళ్ళ రాదు.
అత్యవసర సమయంలో ప్రిసిడింగ్ అధికారి ఆదేశాల మేరకు మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళాలి.
ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటు వేసిన వారిని కేంద్రం నుండి బయటకు పంపించాలి.
పోలింగ్ కేంద్రానికి( Polling Station ) చేరుకోగానే పోలింగ్ కేంద్రం చుట్టూ పరిశీలించాలి,100 మీటర్స్, 200 మీటర్ లైనింగ్ వేయించాలని సూచించారు.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లను, క్యూ పద్ధతిలో పోలింగ్ కేంద్రంలో నికి పంపించాలి.
పోలింగ్ కేంద్రంలో కి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లు వద్ద అగ్గిపెట్టెలు, నీళ్ల బాటిళ్లు, సెల్ ఫోన్లు, మరే ఇతర వస్తువులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.
ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు, ఓట్లు వేయడానికి వచ్చే సమయంలో వీలైనంత త్వరగా ఓటు వేయించి బయటకు పంపించేలా చూడాలి.
పోలింగ్ కేంద్రంలో ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంటే వెంటనే మొబైల్ పార్టీకి సమాచారం అందించాలని సూచించారు.
రూట్ మొబైల్ పార్టీ యొక్క విధులు రూట్ మొబైల్ పార్టీలు ఈవీఎం లకు ఎస్కార్ట్ గా ఉండి పంపిణీ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్ కు చేర్చి, తిరిగి పోలింగ్ పూర్తయిన తర్వాత తీసుకొని ఎస్కార్ట్ గా వచ్చి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అప్పగించే అంతవరకు అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంల భద్రత మనపై ఉందన్నారు.
పోలింగ్ కేంద్రాలను కలుపుతూ ఉన్న రూట్లలో పోలింగ్ కేంద్రం సమీపంలో ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలి.
పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల 100 గజాల వరకు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన టేబుల్స్ వేయడానికి వీలులేకుండా చూడాలన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు పోస్టర్లు పోలింగ్ కేంద్రం(
Polling Station ) వద్ద లేకుండా చూడాలి.
ఓటర్లను ప్రైవేట్ వాహనాలు ఆటోలు, జీపులు, కార్లలో, తీసుకురాకుండా చూడాలి.ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ?