మేడ్చల్ వీబీఐటీ కాలేజ్లో మార్ఫింగ్ కేసు నిందితులు అరెస్ట్..!
TeluguStop.com
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వీబీఐటీ కాలేజ్లో కలకలం రేపిన మార్ఫింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.విజయవాడలో ఒకరిని, మరో ప్రాంతంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులను హైదరాబాద్ కు తీసుకురానున్నారు.
బాధిత విద్యార్థినీల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మల్కాజ్ గిరి ఏసీపీ నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వాట్సాప్ డీపీ ఫోటోలు సేకరించి న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు.ఈ క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థినిల ఫోన్ నెంబర్లు ఎలా సేకరించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటివరకు ఎంతమంది ఫోటోలను మార్ఫింగ్ చేశారు.? విద్యార్థినిల వ్యక్తిగత వివరాలను కాలేజీ నుంచే ఎవరైనా ఇచ్చారా.
? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ కేబినెట్ భేటీ : సోషల్ మీడియా కోసం కొత్త చట్టం ?