కేసు విషయంలో ఆరా కోసం వస్తే... పోలీసులపైకి కుక్కను వదిలారు ! ఆ కుక్క ఏం చేసింది అంటే..?

కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు రాసి గేటు ముందు పెడుతుంటారు.పొరపాటున ఎవరైనా లోపలి వస్తే ఇంటికి కాపలా ఉన్న కుక్క వచ్చినవారిని ఏమీ చేయకుండా ఉంటుంది అని అలా చేస్తారు.

అయితే ఇంట్లో యజమానులు ఇంటికి వచ్చిన వారి మీద అందునా .పోలీసుల మీద కుక్కను వదిలి దానితో కురిపించిన సంఘటన భోపాల్ లో జరిగింది.

వివరాలు చూస్తే.ఇరుగుపొరుగు వివాదంలో నిందితులను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు ఖంగుతిన్న ఉదంతం వెలుగు చూసింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పోలీసులను గమనించిన నిందితురాలి తల్లి వారిపైకి కుక్కను ఉసిగొల్పింది.

అది ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడిచేసి గాయపరిచింది.మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల నెవ్రీ మందిరం సమీపంలో ఉంటున్న మాలతీరాయ్ కుటుంబ సభ్యులు, వారి పొరుగింట్లో ఉంటున్న నాజిమ్‌ల మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి.

ఈ నేపధ్యంలో తాజాగా జరిగిన కొట్లాటపై నాజిమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేసేందుకు మాలతీరాయ్ ఇంటికి వచ్చారు.

అయితే ఆ ఇంట్లోనివారు పోలీసుల మీదకు కుక్కను ఉసిగొల్పారు.ఆ కుక్క ఒక మహిళా కానిస్టేబుల్‌ను గాయపరిచింది.

ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటనపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ ఉదంతానికి పాల్పడిన వారిని కటకటాల వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏపీలో దూకుడు పెంచుతోన్న బీజేపీ .. భారీగా  స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు