చుండ్రు ఉన్నప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు

చుండ్రు మీద పోరాటం చేస్తున్న ఎటువంటి పలితం కనపడటం లేదా? అయితే చుండ్రు నివారణ సమయంలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో కనిపెట్టాలి.

1.జుట్టుకు నూనె రాయుట జిడ్డు గల తల చర్మం మీద మంటకు చుండ్రు ఒక కారణం అని చెప్పవచ్చు.

తల మీద చుండ్రు ఉన్నప్పుడు నూనె రాస్తే పరిస్థితి తీవ్రం అవుతుంది.జిడ్డు ఉన్న తల చర్మం మీద సులభంగా బాక్టీరియా అభివృద్ధి జరిగి ఇన్ ఫెక్షన్ కి కారణం అవుతుంది.

చుండ్రు మీద పోరాటం చేసే సమయంలో తలకు నూనె రాయకూడదు.2.

తలకు స్కార్ఫ్ ఉపయోగించకూడదు కాలుష్యం నుండి జుట్టును రక్షించేందుకు తల చుట్టూ ఒక స్కార్ఫ్ఉపయోగించవచ్చు.

కానీ చుండ్రు ఉన్న సమయంలో ఈ విధంగా చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది.

ఎందుకంటే స్కార్ఫ్ ఉపయోగించటం వలన వేడి మరియు చెమట ఎక్కువగా పట్టి చుండ్రు పెరగటానికి కారణం అవుతుంది.

"""/" / 3.వేడి మరియు స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించటం చుండ్రు మరియు మంట ఉన్న సమయంలో బ్లో డ్రైయర్ మరియు హెయిర్ స్ట్రైట్ నర్ వంటి వాటిని ఉపయోగిస్తే చెమట మరియు వేడి ఎక్కువ అవుతాయి.

తల మీద చర్మం సున్నితంగా ఉన్నప్పుడు స్టైలింగ్ ఉత్పత్తులు మరియు రసాయనాలను ఉపయోగిస్తే చర్మంకు చికాకు కలుగుతుంది.

4.తప్పు షాంపూ ఉపయోగించుట మార్కెట్ లో అనేక యాంటీ-డాండ్రఫ్‌ షాంపూ లు అందుబాటులో ఉన్నాయి.

వాటిని వాడాలి.ఈ యాంటీ-డాండ్రఫ్‌ షాంపూలు మంట ఉపశమనం మరియు చుండ్రును తగ్గించటంలో సహాయ పడతాయి.

అయితే వీటిని ఎంపిక చేసుకొనే సమయంలో చర్మవ్యాధి నిపుణుని సలహా తీసుకోవాలి.5.

చర్మాన్ని గోకుట చుండ్రు ఉన్నప్పుడు తల మీద చర్మం విపరీతమైన దురద వచ్చి గోకే అనుభూతి కలుగుతుంది.

పదునైన దువ్వెనలు మరియు జుట్టు క్లిప్ లను ఉపయోగించి గోకితే చర్మ చికాకుకు కారణం అవుతుంది.

ఇంకా గట్టిగా గోకితే తల మీద చర్మంనకు హాని జరిగి ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బొద్దుగా ఉన్నారంటూ శ్రీలీలపై కామెంట్స్.. విమర్శల విషయంలో జాగ్రత్త పడాల్సిందే!