నటి పూజా హెగ్డేతో ముద్దు వద్దనడానికి అదే కారణం.. శేష్ కామెంట్స్ వైరల్!

క్షణం, మేజర్, గూఢచారి వంటి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ డిసెంబర్ రెండవ తేదీ హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శేష్ కి యాంకర్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈయన గత కొద్దిరోజుల క్రితం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆ కార్యక్రమంలో ఏ హీరోయిన్ కి ముద్దు పెట్టకూడదు అనుకున్నారు అంటూ బాలకృష్ణ అడగడంతో పూజ హెగ్డే పేరు చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/12/Ai-SeshShailesh-kolanu-Hit-2!--jpg "/ ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పూజా హెగ్డేకు ఎందుకు ముద్దు పెట్టకూడదనుకున్నారు అంటూ మరోసారి ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఆ రోజు బాలకృష్ణ గారు అడిగారు ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి తాను పూజా హెగ్డే పేరు చెప్పానని ఈ సందర్భంగా శేష్ వెల్లడించారు.

ఇకపోతే ఇప్పటివరకు తాను పూజతో కలిసి నటించలేదు అందుకే ఈ సమాధానం చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది అంటూ శేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

రుణమాఫీ చేస్తాం.. హరీశ్ రావు ఛాలెంజ్ స్వీకరించిన సీఎం రేవంత్ ..!!