అలాంటి వాళ్ళకి అందుకే కలలు రావంట…
TeluguStop.com
సాధారణంగా మానవునికి 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరమని ఇప్పటికే పలు అధ్యయనాల ద్వారా వైద్యులు స్పష్టం చేశారు.
అయితే రాత్రి పూట సుఖంగా నిద్ర పోయే వారికి మంచి కలలు వస్తాయని ఈ కలల ద్వారా ఒక్కోసారి వచ్చే ఆలోచనలతో మొత్తం తమ జీవితమే మారిపోతుందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే సుఖ నిద్రలో వచ్చేటువంటి కలలు మన వాస్తవిక జీవితాలకు దగ్గరగా ఉంటాయని అందువలన కొందరు "మహానుభావులు కలలు కనండి.
వాటిని వాటిని నెరవేర్చుకునేందుకు కష్టపడండని" చెబుతుంటారు.అయితే తాజా అధ్యయనం ప్రకారం ఎవరైతే సరిగ్గా నిద్ర పోకుండా ఎక్కువ సమయం మేల్కొని ఉంటారో వారికి పెద్దగా కలలు రావని కనుగొన్నారు.
అయితే రోజు మొత్తంలో సాధారణ నిద్రను ఆస్వాదించే వారికి మాత్రం సగటున నాలుగు నుంచి ఆరు కలలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
అంతేకాక వీరు సుఖంగా నిద్ర పోవడం వల్ల పలు అనారోగ్యాల సమస్యల నుంచి కూడా తప్పించుకో గలుగుతున్నారని తెలిపారు.
కానీ రోజు మొత్తంలో సాధారణ నిద్ర కంటే తక్కువ నిద్రపోయే వారికి ఆందోళనలు, ఇతర మానసిక రుగ్మతలు లేదా అనారోగ్య పరిస్థితులు వంటి వాటికి గురవుతుంటారని అంటున్నారు.
అందువల్ల ఇలాంటి వారికి కలలు వచ్చినా కూడా గుర్తు ఉండవని కాబట్టి ప్రతి ఒక్కరు 6 నుంచి 8 గంటల సేపు రోజులో నిద్రకు కేటాయించాలని సూచిస్తున్నారు.
అయితే ఈ నిద్ర కూడా రాత్రి సమయంలో మాత్రమే మంచిదని పగటిపూట నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2025 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసులు…