Thatikonda Rajaiah : అలిగిన రాజయ్య .. బీఆర్ఎస్ కు రాజీనామా 

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Thatikonda Rajaiah ) ఆ పార్టీకి రాజీనామా చేశారు.

వరంగల్ పార్లమెంట్( Warangal Parliament ) స్థానాన్ని ఆశించిన రాజయ్యకు ఆ పార్టీ అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోవడం, టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో, అసంతృప్తికి గురై బీఆర్ఎస్ పార్టీకి( BRS ) రాజీనామా చేశారు.

త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు.

దీంతో తనకు కచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారని, రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తారనే నమ్మకంతో అప్పట్లో సర్దుకుపోయారు.

"""/" / అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచి వేరొకరిని పోటీకి దించేందుకు అధిష్టానం మొగ్గు చూపిస్తుండడం, తనుకు టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసేందుకు ప్రయత్నించడంతో అధిష్టానం రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించి ఎంపీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చింది.

స్టేషన్ ఘన్ పూర్( Station Ghanpur ) స్థానాన్ని కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) ఇచ్చింది.

దీంతో కడియం శ్రీహరి విజయానికి రాజయ్య కృషి చేశారు.అయితే ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేస్తున్నబీఆర్ఎస్ అధిష్టానం తన పేరును పరిశీలనకు తీసుకోకపోవడం, """/" / టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన బీఆర్ ఎస్ కు రాజీనామా చేశారు.

కాంగ్రెస్ లో చేరేందుకు రాజయ్య ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్( Congress ) నుంచి ఎంపీ టికెట్ హామీ దక్కిన వెంటనే ఆ పార్టీలో చేరాలనే ఆలోచనతో రాజయ్య ఉన్నారు.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఊహించని విధంగా సీనియర్ నేతలు రాజీనామా చేయడం ఆందోళన కలిగిస్తుంది.

కాకపోతే రాజయ్య కాంగ్రెస్ లో చేరినా ఆయనకు ఎంపీ టికెట్ దక్కుతుందా అనేది అనుమానమే.

మెగా ఫ్యామిలీ Vs అల్లు ఫ్యామిలీ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధించబోతున్నారు…