ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం.. ఇప్పటి తరానికి తెలియని విషయాలు

1974లో వచ్చిన "తాతమ్మ కల" సినిమా ( Tatamma Kala )బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా అతిపెద్ద సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కూడా అయింది.దీనిపై బ్యాన్ కూడా విధించారు.

బహుశా టాలీవుడ్ హిస్టరీలో నిషేధానికి గురయిన మొదటి సినిమా ఇదే కావచ్చు.ఈ సినిమాలో కుటుంబ నియంత్రణ, భూసంస్కరణలకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటం వల్ల ప్రభుత్వం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒకప్పుడు సంతానం అంటే భగవంతుడు ఇచ్చే అత్యంత అద్భుతమైన వరం అని ప్రజలు నమ్మేవారు.

కానీ కుటుంబ నియంత్రణ పేరిట దీనికి అడ్డంకిగా నిలిచింది ప్రభుత్వం.ఆ రూల్స్ చాలా మందికి నచ్చలేదు.

అదే సమయంలో సినిమా కూడా అదే నమ్మకానికి వత్తాసు పలికింది.ఇందులోని డైలాగులు కుటుంబ నియంత్రణకు, భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఉన్నాయి.

అందుకే ఈ మూవీ పెద్ద దుమారం లేపింది.ఏపీ అసెంబ్లీలోనూ ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది.

ఈ మూవీ ప్రొడ్యూసర్ ( Movie Producer )కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మొదటిసారి విడుదలయ్యి ఇది బ్యాన్ అయ్యింది.తర్వాత మళ్ళీ బ్యాన్ లిఫ్ట్ చేయడంతో మరోసారి రిలీజ్ అయింది.

అలా రెండుసార్లు విడుదలై ఈ సినిమా సంచలనం సృష్టించింది. """/" / జోక్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే బ్యాన్ చేయలేదు.

50 రోజులు ఆడిన తర్వాత అప్పుడు అభ్యంతరం తెలుపుతూ నిషేధించారు.దాంతో దిగివచ్చిన మూవీ టీమ్‌ వెంటనే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న అంశాల్ని పూర్తిగా తొలగించింది.

వాటిని వేరే సీన్లతో రీప్లేస్‌ చేసింది.ఫలితంగా సెన్సార్ క్లియర్ చేసుకోగలిగింది.

మరోసారి రిలీజ్ చేసుకునే అనుమతిని పొందింది. """/" / ఈ సినిమాలో హీరో బాలకృష్ణ( Balakrishna ).

టైటిల్ రోల్ భానుమతి( Bhanumati ) ప్లే చేసింది.సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) ఈ మూవీని నిర్మించి డైరెక్ట్ చేశారు.

సినిమా మొత్తం నందమూరి వారికి చెందినదే అయినా భానుమతి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

ఈ మూవీలో పాటలు కూడా బాగుంటాయి కోరమీసం కుర్రోడా పాట చాలామందిని ఆకట్టుకుంది.

ఎస్.రాజేశ్వరరావు( S.

Rajeswara Rao ) అందించిన సంగీతం మూవీ విజయంలో కీ రోల్‌ ప్లే చేసింది.

ఈ సినిమా వివాదాస్పదంగా మారినా దీనికి నంది అవార్డు లభించింది.

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని ఆడించిన అడివి శేష్.. ఈ హీరో గ్రేట్ అంటూ?