30 లక్షలతో తీస్తే 13 కోట్ల వసూళ్లను రాబట్టిన ఆ స్టార్ హీరో సినిమా…

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ వాళ్ల సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ ( Uday Kiran )లాంటి నటుడు చాలా ఉత్సాహంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూడు సినిమాలతోనే సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత తను స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరు అనుకున్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన పాతాళానికి పడిపోయాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఆయన నటించిన మొదటి చిత్రం అయినా 'చిత్రం ' సినిమా( Chitram ) తోనే తను ఒక పెను సంచలనాన్ని సృష్టించాడు.

ఇక ఆ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక 30 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 13 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ గా నిలిచింది.

ఇక రామోజీరావు ( Ramoji Rao )ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా ఆయన భారీ కలెక్షన్లతో ముందుకు సాగారు.

ఇక దర్శకుడు అయిన తేజ( Teja ) కూడా అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను తెరకెక్కిస్తు తనకంటూ ఒక మార్క్ చూపిస్తున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా కోసం చాలామంది హీరోలని చూసిన తేజ వాళ్ళెవరూ దానికి సెట్ అవ్వరనే ఉద్దేశ్యం తో ఉదయ్ కిరణ్ ను సెలెక్ట్ చేసి ఆయనతో ఆ సినిమా చేశారు.

ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో కూడా రెండు మూడు సినిమాలు రావడం విశేషము.

ఇక మొత్తానికైతే చిన్న సినిమాలు తీసి భారీ విజయాన్ని సాధించొచ్చు అని చెప్పిన సినిమాగా ఈ సినిమాను మనం చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక అప్పటినుంచి చిన్న సినిమాలు వరుసగా తెరకెక్కుతూ మంచి సక్సెస్ లను అందుకున్నాయి.

నాగ్ అశ్విన్ ఫ్యామిలీ ఆ ఊరిలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించిందా. గ్రేట్ అంటూ?