ప‌వ‌న్ కోసం ఒక్క‌ట‌వుతున్న ఆ సామాజిక వ‌ర్గం.. అధికార‌మే ల‌క్ష్యం

ఒక రాజ‌కీయ పార్టీకి సామాజిక వ‌ర్గాల అండ లేకుంటే మ‌నుగ‌డ క‌ష్టం.బ‌య‌టి దేశాల్లో ఎలా ఉన్నా స‌రే గానీ మ‌న దేశంలో మాత్రం ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది.

ఎందుకంటే ఇక్క‌డి కుల రాజ‌కీయాల‌కు అంత ప్రాధాన్య‌త ఉంది మ‌రి.మొద‌టి నుంచి రాజ‌కీయ పార్టీలు అన్ని కూడా కులాల చేతుల్లోనే ఉన్నాయి.

కొన్ని వ‌ర్గాలు మాత్ర‌మే రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి.ఈ విష‌యం ఏపీ రాజ‌కీయాల‌కు బాగా సూట్ అవుతుంది.

ఎందుకంటే మొద‌టి నుంచి ఇక్క‌డి పార్టీల‌న్నీ కూడా కొన్ని సామాజిక వ‌ర్గాల అండ‌తోనే అధికారంలోకి వ‌స్తున్నాయి.

బ‌లైమ‌న సామాజిక వ‌ర్గాలుగా రెడ్డి, క‌మ్మ‌, కాపు వ‌ర్గాలు ఇక్క‌డి రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి.

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ కాపు సామాజిక వర్గం అయినా కూడా ఆయ‌న మొద‌ట్లో కుల రాజ‌కీయాల‌ను చేయ‌బోనంటూ స్ప‌ష్టత ఇచ్చేశారు.

దాంతో గ‌త ఎన్నిక‌ల్లో కాపులు వ‌ర్గాలుగా విడిపోయారు.ఇందులో కొంద‌రు ప‌వ‌న్‌కు స‌పోర్టు చేస్తే మ‌రికొంద‌రు మాత్రం వైసీపీ, టీడీపీల‌కు మ‌ద్ద‌తు ప‌లికాయి.

అయితే ప‌వ‌న్ క‌ల్యాన్ ఆ త‌ర్వాత రియ‌లైజ్ అయిపోయారు.ఇలా అయితే కుద‌ర‌ద‌ని తాను కూడా సామాజిక వ‌ర్గా అండ‌తోనే అధికారంలోకి రావాల‌ని డిసైడ్ అయిపోయారు.

"""/"/ ఇందుకోసం కాపుల‌ను ఒక్క‌టి చేసే ప‌నిలో ప‌డ్డారు.ఇక కాపు వ‌ర్గాలు కూడా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు ముందుకు వ‌స్తున్నాయి.

ఇందులో భాగంగా రాబోయే ఎన్నిక‌ల్లో జగన్ మోహ‌న్‌రెడ్డిని గద్దె దించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఆల్రెడీ రెడ్డి, క‌మ్మ వాళ్ల‌కు అధికారం వ‌చ్చింది కాబ‌ట్టి ఈ సారి త‌మ‌కే దక్కాల్సింద‌ని కాపులు డిసైడ్ అయిపోయారంట‌.

మొన్న రాజమండ్రిలో ప‌వ‌న్ మాట్లాడుతూ కాపులు ఒక్క‌టి కావాల‌ని ఇచ్చిన నినాదం బాగానే ప‌నిచేస్తోందంట‌.

చాలా వ‌ర్గాల నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా కాపుల వ‌స్తున్నారంట‌.ఇక వారంతా ఒక్క‌టిగా క‌దిలితే మాత్రం వైసీపీకి పెద్ద న‌ష్ట‌మ‌నే చెప్పాలి.

ఎందుకంటే ఏపీలో కాపు ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి.

భారత సంతతి వ్యక్తికి ప్రతిష్టాత్మక ‘‘ యూకే పీఎం పాయింట్స్ ఆఫ్ లైట్ ’’ అవార్డు