ఆ షాప్‌కీపర్ మనసు బంగారం.. వాలెట్ పోగొట్టుకున్న ఫారెనర్స్ కోసం ఏం చేశాడంటే..!

"అతిథి దేవో భవ" అనేది భారతీయులు పాటించే ఒక మంచి ఆచారం.అంటే అతిథి దేవుడితో సమానం అని భారతీయులు అతిథులకు ఎన్నో మర్యాదలు చేస్తారు.

కాగా తాజాగా గుజరాతీ షాప్‌కీపర్ మన ఇండియాకి అతిథిగా వచ్చిన ఫారెనర్స్‌కి పెద్ద హెల్ప్ చేశాడు.

ఒక విదేశీ పర్యాటకురాలు గుజరాత్ ట్రైన్‌లో వాలెట్‌ను పోగొట్టుకుంది.అందులో చాలా డబ్బులు కూడా ఉన్నాయి.

అయితే షాప్‌కీపర్ డబ్బులపై ఆశ పెంచుకోకుండా అతిథులుగా వచ్చిన వారికి సహాయం చేయాలని గొప్పగా ఆలోచించాడు.

ఆ ఆలోచనతోనే వాలెట్‌ను తిరిగి ఇచ్చేశాడు.ఇంత మంచి పని చేసినందుకు ఆ ఫారెనర్ అతడికి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించింది.

కానీ అతడు రూపాయి కూడా తీసుకోలేదు.ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌లో జరిగింది.

2022లో భారతదేశానికి వచ్చిన వీడియో కంటెంట్ క్రియేటర్ స్టెఫ్ భారతదేశంలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు డబ్బుతో ఉన్న తన వాలెట్ పోగొట్టుకుంది.

అంతేకాదు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా అందులోనే ఉన్నాయి.దాంతో ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారింది.

స్టెఫ్ భర్తతో కలిసి ఇండియాలో పర్యటిస్తోంది.అయితే వాలెట్ పోగొట్టుకున్న బాధలో ఉన్న సమయంలోనే ఒక గుజరాతీ షాప్‌కీపర్ పర్యాటకుల వాలెట్‌ని తిరిగి ఇచ్చాడు """/"/ తన వాలెట్ పోగొట్టుకున్న నాలుగు రోజుల తర్వాత స్టెఫ్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కి చిరాగ్ అనే దుకాణదారుడి నుంచి మెసేజ్ వచ్చింది.

దాన్ని చూడగానే ఒక మిరాకిల్ జరిగినట్లు ఆమె ఫీల్ అయింది.ఆశలు వదిలేసుకున్న తన వాలెట్ ఇలా చిరాగ్ రూపంలో మళ్లీ దొరకడం ఒక అద్భుతంగా అనిపించింది.

ఈ విదేశీయురాలు చిరాగ్ మంచితనాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఈ వీడియోలో, స్టెఫ్ తన భర్తతో కలిసి చిరాగ్‌ను కలుసుకుని అతని నుంచి వాలెట్‌ను తీసుకోవడం చూడవచ్చు.

కృతజ్ఞతగా వారు అతనికి కొంత డబ్బును కూడా అందించారు కానీ ఆ షాప్‌కీపర్ చిరునవ్వుతో నిరాకరించాడు.

చిరాగ్ మంచితనానికి స్టెఫ్ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.భారతదేశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా నెగిటివ్ వార్తలు వస్తాయి కానీ ఇక్కడ ఎంతో మంచి మనసున్న మనుషులు ఉన్నారు అంటూ ఎమోషనల్ అయిపోయింది.

నెటిజన్లు కూడా చిరాగ్ నిజాయితీని, మంచితనాన్ని పొగుడుతున్నారు.

కూర్చున్న యువకుడిపైకి దూసుకొచ్చిన బస్సు.. చివరికి ఏమైందో చూస్తే గుండెలదురుతాయి..!