ఆ రోడ్డు నిండా డ‌బ్బులే.. ఎగ‌బ‌డుతున్న జ‌నం.. చివ‌ర‌కు

డబ్బులు అంటే ఎవ‌రికి చేదు చెప్పండి.మ‌నం ఓ రోడ్డు మీద న‌డుచుకుంటూ వెళ్తున్న‌ప్పుడు ఏమైనా క‌నిపిస్తేనే వెంట‌నే జేబులో వేసేసుకుంటాం.

అలాంటిది కుప్ప‌లు, తెప్ప‌లుగా దొరికితే విడిచి పెడుతామా చెప్పండి.ఎగ‌బ‌డి మరీ పోగు చేసుకుంటాం.

ఇలాంటి ఘ‌ట‌న‌లు గ‌తంలో అనేకం జ‌రిగాయి.మ‌న దేశంలో కూడా అక్క‌డ‌క్క‌డా ఇలాంటి సంఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి.

అయితే ఇలాంటి సంఘ‌ట‌న‌ల్లో కొన్ని ట్విస్టులు కూడా ఉంటున్నాయి.వాటిని ఏ సినిమా షూటింగ్ కోస‌మో న‌కిలీవి వాడ‌టం చూస్తున్నాం.

లేదంటే కొన్ని సార్లు ఫ్రాంక్ వీడియోల్లాంటివి కూడా అవుతున్నాయి.అయితే ఇప్పుడు కూడా ఓ చోట విప‌రీతంగా డ‌బ్బులు రోడ్ల మీదే క‌నిపిస్తున్నాయి.

ఇంకేముంంది వాటిని తీసుకునేందుకు జ‌నాలు కూడా బాగానే ఎగ‌బ‌డుతున్నారు.అమెరికా దేశానికి చెందిన దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో ఉండే ఫేమ‌స్ రూట్ అయిన ఫ్రీవే రోడ్డు నిండా ఇలా డాలర్ల వ‌ర్షం కురుస్తోంది.

ఇది తెలుసుకున్న వారంతా ఎగ‌బ‌డిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

దాన్ని చూసిన వారంతా అయ్యో మేము వెళ్తే బాగుండు అని ఎమోష‌న‌ల్ అయిపోతున్నారు.

ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫీసుకు ఓ వాహ‌నం డబ్బుల‌ను మోసుకెళ్తోంది.

"""/"/ అయితే ఇలా బ‌య‌లు దేరిన వాహ‌నం మ‌ధ్య‌లోకి రాగానే తలుపు అకస్మాత్తుగా తెరుచుకోవ‌డంతో అందులో ఉన్న డ‌బ్బుల సంచులు మొత్తం కిందపడ్డాయి.

అందులో కొన్ని డాల‌ర్లు రోడ్డు మీద ప‌డిపోవ‌డంతో జ‌నాలు చూసి వాటిని తీసుకున్నారు.

ఇక ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో వారు రంగంలోకి దిగిపోయార‌.ప్ర‌జ‌ల‌ను కంట్రోల్ చేసి అక్క‌డ రోడ్ల‌ను దిగ్బంధించారు.

ఇక ఇలా డ‌బ్బులు తీసుకున్న వారిని ఇచ్చేయాల‌ని ఆదేశించ‌డ‌గా చాలామంది ఇచ్చారు.మ‌రి కొంద‌రు మాత్రం పోలీసులు రాక‌ముందే అక్క‌డి నుంచి జారుకున్నారు.

ఈ హోమ్ మేడ్ షాంపూతో హెయిర్ ఫాల్, డాండ్రఫ్ రెండూ ఖతం!