ఆ రెండు పార్టీల పొత్తుకు ఎసరు పెడుతున్నఆ ఒక్క నియోజకవర్గం?
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు పూర్తిస్థాయి క్రియాశీలకు కార్యాచరణను మొదలుపెట్టేసాయి.
సమన్వయ కమిటీల భేటీలు, ఉమ్మడి మేనిఫెస్టోలు, ఉమ్మడి ప్రచారం, అంటూ ప్రతి అంశాన్ని కలిసికట్టుగా నిర్వహిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వరకూ ఆ రెండు పార్టీలకు పొత్తుకు ప్రస్తుతానికి ఏ ఇబ్బంది కలగకపోయినా తెలంగాణలో మాత్రం కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నట్లుగా తెలుస్తుంది.
"""/" /
సెటిలర్ల ఓట్లు కీలకంగా మారిన ఆ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలుపు బోణి కొట్టాలని చూస్తున్న జనసేనకు తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ కలిసి రావడం లేదంట.
తెలుగుదేశం అనుకూల సామాజిక ఓటర్లు గణనీయంగా ఉండే ఈ నియోజకవర్గంలో బహిరంగంగా తమకు మద్దతు ప్రకటించాలని జనసేన కోరుతుంటే తమకు పార్టీ ఆదేశాలే శిరోధార్యమని, తమ పార్టీ ప్రకటించకుండా బహిరంగ మద్దతు అసాధ్యమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారట.
అంతేకాకుండా అక్కడ జనసేన( Janasena ) నిలబెట్టిన అభ్యర్థి కూడా జనసేన ముసుగులో ఉన్న బిజేపి అభ్యర్థి( BJP ) అని చంద్రబాబు అరెస్టు వెనక బిజెపి ఉందన్న అనుమానాలు నడుమ బిజెపి అభ్యర్థికి పూర్తిస్థాయిలో సహకరించలేని వాతావరణం కూడా అక్కడ కనిపిస్తున్నదట.
"""/" / అయితే కనీసం ఒక సీటును కూడా గెలవకపోతే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసిపి( YCP ) నుంచి వచ్చే విమర్శలను తట్టుకోవటం కష్టమవుతుందని బావిస్తున్న జనసైనికులు సర్వ శక్తులనూ ఒడ్డుతున్నారట .
ఈ ఒక్క నియోజకవర్గాన్ని గెలుచుకుంటే రెండు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీగా తమపార్టీ ప్రాబల్యం మరింత పెరుగుతుందనే ఆలోచనలో జనసైనికులు ఉన్నట్టుగా తెలుస్తుంది.
దాంతో తమ పార్టీ గెలుపు కోసం కలసి రావలసిందిగా తెలుగు తమ్ములను ఒత్తిడి చేస్తున్నారట .
దాంతో కొన్ని చోట్ల కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .
మరి రెండు పార్టీల అధిష్టానాలు కలగజేసుకొని ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దకపోతే పొత్తు విచ్చినానికి కూకట్పల్లి నాంది పలుకుతుందని కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు .
పుష్ప 2 విడుదల… బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ?