ఆ వార్తలలో వాస్తవం లేదు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ..!!

ఇటీవల విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్ అయినట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.

దీంతో వస్తున్న వార్తలపై వైద్య ఆరోగ్యశాఖ క్లారిటీ ఇవ్వటం జరిగింది.ఈ సందర్భంగా అమరావతిలో మీడియా మీట్ నిర్వహించిన ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి.

విదేశాల నుండి వచ్చిన 30 మంది ప్రయాణికుల ఆచూకీ కనబడటం లేదని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని అవన్నీ.

ఫేక్ వార్తలని కొట్టిపారేశారు.ఇటువంటి అపోహలు ఎవరూ నమ్మవద్దని ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.

స్పష్టం చేశారు.అదే రీతిలో వైజాగ్ సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు.

కేంద్రం ఇవ్వటం జరిగిందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఆ 30 మంది వారి ఇళ్లలోనే ఐసోలేషన్ లో.

ఉండేవిధంగా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి అని.నేరుగా అంతర్జాతీయ విమానాలు రాష్ట్రంలో రావడానికి ఎక్కువ అవకాశం లేదని.

రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి వైద్య బృందాలను ఏర్పాటు చేయడం వారి పర్యవేక్షణలో నిరంతర స్క్రీనింగ్ టెస్టులు.

చేస్తూ ఉన్నారు అని హైమావతి పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి..!