ఆ కారణంతోనే నేను థియేటర్లకు వెళ్లి సినిమా చూడను… పవన్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు(Arrest ) గురించి స్పందించిన సంగతి మనకు తెలిసిందే.
ఇన్ని రోజులపాటు అల్లు అర్జున్ అరెస్టు గురించి మౌనం పాటించిన పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియా చిట్ చాట్(Pawan Kalyan's Media Chit Chat) కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు(Allu Arjun Arrested) గురించి ప్రశ్నలు ఎదురవడంతో వాటిపై స్పందిస్తూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏ రంగంలో పనిచేసే వారికైనా బాగా పనిచేస్తున్నారు అంటే సంతోషపడతారు.
"""/" /
అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు కూడా తాము నటించిన సినిమాని ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తున్నారు.
వారి అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే మొదటి రోజు సినిమా థియేటర్లకు వస్తారు.
ఇక సెలబ్రిటీలు బయటకు వచ్చిన అభిమానులను చూసి చేయి ఊపకపోతే వారికి పొగరు అని అనుకుంటారు.
అందుకే హీరోలు బయటకు వస్తే తప్పనిసరిగా ప్రేక్షకులకు అభిమానులకు అభివాదం చేస్తూ చెయ్యి ఊపుతూ ముందుకు వెళ్తారు అల్లు అర్జున్ (Allu Arjun)కూడా అదే చేశారని తెలిపారు.
"""/" /
ఇలా మొదటి రోజు థియేటర్ కి హీరోలు వస్తే పెద్ద ఎత్తున అభిమానులు తమని చూడటం కోసం ఎగబడుతూ ఉంటారు.
అందుకే నేను ఈ మధ్యకాలంలో నా సినిమాలు విడుదలయితే థియేటర్లకు వెళ్లడం పూర్తిగా మానేశాను.
నా మూడో సినిమా నుంచి కూడా నేను థియేటర్లకు వెళ్లడం లేదని తెలిపారు.
నేను థియేటర్ కి వెళ్తే ప్రేక్షకులు సినిమా చూడరు.వారి అనుభూతిని పాడు చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకే నేను నా సినిమాలు విడుదలయితే థియేటర్ కి వెళ్లి సినిమాలు అసలు చూడనని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక అల్లు అర్జున్ అరెస్టు గురించి కూడా మాట్లాడుతూ ఆ స్థానంలో రేవంత్ రెడ్డి కాదు నేను ఉన్నా కూడా అరెస్టు చేయించే వాడిని.
అలాంటి సమయంలో నువ్వు ఎవరన్నది ముఖ్యం కాదు నీ కారణంగా ఏం జరిగిందనేది ముఖ్యం అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘బైరవం’ సినిమాలో నారా రోహిత్ మంచు మనోజ్ క్యారెక్టర్లు ఏంటి..?