విశాఖ రాజధానిగా ప్రకటించింది…అందుకే సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.

ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ఎలక్షన్స్ గురించి ప్రత్యర్ధులు గురించి అనేక విషయాలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద నగరం అన్ని స్పష్టం చేశారు.విశాఖ ఒక గ్రోత్ ఇంజన్( Visakha ) లాంటిదని పేర్కొన్నారు.

విశాఖలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి.తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో.

ఏపీకి విశాఖ ఐకాన్ సిటీ.అమరావతిలో అభివృద్ధికి ఎకరానికి రెండు కోట్లు అవసరం.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయికి విశాఖ ఎదగాలి.మా హయాంలో ఏపీకి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి.

2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.

"""/" / ఎంఎస్ఎమ్ఈలో( MSME ) 20 లక్షల మందికి ఉపాధి దక్కింది అని వెల్లడించారు.

ఈ క్రమంలో పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించారు.

దీనికి వైఎస్ జగన్ సమాధానమిస్తూ.ఆ రకంగా మాట్లాడేవారు పెత్తందారులే.

చేయూతతో చాలామంది వ్యాపారాలు పెట్టి.వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడ్డారు.

అమ్మఒడి లేకుంటే పిల్లలకు అండగా ఎలా నిలబడతాం? రైతుభరోసా లేకుంటే రైతులకు పెట్టుబడి ఎలా? మేం చేసే డీబీటీ లకు ఒక ప్రయోజనం ఉంది.

చాలా మంది నిలదొక్కుకున్నారు.90% కుటుంబాల అభివృద్ధిలో నా పాత్ర ఉంది' అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఎలక్షన్స్ లో ఓటు వేసే వాళ్లు ఇంట్లో ప్రతి ఒక్కరితో చర్చించి ఓటు వేయాలని సూచించారు.

ఈ క్రమంలో పిల్లలతో పాటు వృద్ధులతో, మహిళలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వైయస్ జగన్ స్పష్టం చేశారు.

కంచెను దాటేందుకు ప్రయత్నించిన 10 అడుగుల మొసలి.. భయానక వీడియో వైరల్..