అందుకే ఆ యాంకర్ బిగ్ బాస్ కి వెళ్ళదంట … !

టాలీవుడ్ లో తన గలగల మాటలతోనే కాకుండా అంద, చందాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ.

అయితే ఈ అమ్మడు ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే, మరోపక్క సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తోంది.

అయితే ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర అనసూయకి మంచి గుర్తింపు వచ్చింది.

అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ అనసూయ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

ఇందులో ముఖ్యంగా తెలుగులో అనతికాలంలోనే బాగా పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు యాంకర్ అనసూయకు అవకాశం వచ్చినా కూడా తనకు ఇష్టం లేదని చెప్పేసిందట.

అయితే అందుకు గల కారణాలు లేకపోలేదు.ప్రస్తుతం యాంకర్ అనసూయ తెలుగు బుల్లితెరలో టీవీ ఛానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని ఛానళ్లలో పలు షోలు, ఈవెంట్లు నిర్వహిస్తోంది.

దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో రోజులో ఎక్కువ సమయం షూటింగ్ కి కేటాయిస్తోంది.

అందువల్లనే యాంకర్ అనసూయ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి "ఆచార్య" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

దీంతో ఈ అమ్మడు ఒకపక్క వెండితెరపై, మరోపక్క బుల్లితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

ఇది కదా తెలివంటే.. భర్త సీక్రెట్ ఎఫైర్ గుట్టు రట్టు చేసిన భార్య..