పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం అదే.. ఓటమిపై స్పందించిన బాబర్ ఆజాం..!

బెంగళూరు వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఓటమిపై పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం( Babar Azam ) స్పందించాడు.

తమ జట్టు స్థాయికి తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోవడం, డేవిడ్ వార్నర్ క్యాచ్ జారవించడం వల్ల తమ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

ఆస్ట్రేలియా( Australia ) తమ ముందు ఉంచిన లక్ష్యం మరీ చేదించలేనిదైతే కాదు.

తమ జట్టు టార్గెట్ చేజ్ చేస్తుందనే కాన్ఫిడెంట్ అందరిలో ఉందని చెప్పాడు.గతంలో ఇలాంటి అనుభవాలు చాలానే చూసామని, కాకపోతే మిడిల్ ఆర్డర్ ఓవర్లలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం.

పాకిస్తాన్ జట్టుకు శుభారంభం దక్కిన మిడిల్ ఆర్డర్ రాణించలేకపోవడమే ఓటమికి ఒక ప్రధాన కారణం అని బాబర్ అజం తెలిపాడు.

"""/" / టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 163( David Warner ), మిచెల్ మార్ష్ 121 పరుగులు చేశారు.

వీరిని కట్టడి చేయలేకపోవడం వల్ల ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేయగలిగింది.మ్యాచ్ ఆరంభంలో డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్లను రెండుసార్లు మిస్ చేయడం పాకిస్తాన్ ఓటమిని శాసించింది.

"""/" / పాకిస్తాన్ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ 64( Abdullah Shafique ), ఇమామ్ ఉల్ హక్ 70 పరుగులతో శుభారంభం అందించిన.

జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం 18 పరుగులకే అవుట్ అవ్వడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది.

మహమ్మద్ రిజ్వాన్ 46, సౌత్ షకీల్ 30 పరుగులతో పర్వాలేదు అనిపించిన.పాకిస్తాన్ లోయర్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది.

బాబర్ ఆజాం, రిజ్వాన్ లతోపాటు మరో ఇద్దరు ఆటగాళ్లు మరి కాసేపు క్రీజులో నిలబడి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేదేమో.

ఈ ఓటమిని ఒక గుణపాఠంగా నేర్చుకుని తర్వాతి మ్యాచ్లో రాణిస్తామని బాబర్ ఆజాం తెలిపాడు.

మూవీ కోసం గుండు గీయించుకున్న సుకుమార్ కూతురు.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!