టీడీపీలో ఆ వ‌ర్గం నేత‌ల సైలెంట్‌.. ఒక్క‌రైనా మాట్లాడ‌రే..

టీడీపీకి మొద‌టి నుంచి కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నారు.మ‌రీ ముఖ్యంగా బీసీలు టీడీపీ జెండాను మోస్తున్న వారిలో ప్ర‌ధానంగా ఉన్నారు.

ఇందులో బ‌ల‌మైన నేత‌లు క‌మ్మ‌, కాపు వ‌ర్గానికి చెందిన వారే ఉన్నారు.మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు కాపు వ‌ర్గానికి చెందిన వారికి అధికంగా ప‌ద‌వులు ద‌క్కాయి.

వారు పార్టీ ప‌రంగా ఇటు ప్ర‌భుత్వ ప‌రంగా అనేక ప‌ద‌వులు చేజిక్కించుకుని త‌మ స‌త్తాను చాటుకున్నారు.

అయితే చంద్ర‌బాబు అధికారం కోల్పోయిన త‌ర్వాత వారంతా సైలెంట్ అయిపోవ‌డం పార్టీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒక‌ప్పుడు చంద్ర‌బాబును ఎవ‌రైనా విమ‌ర్శిస్తే కాపు వ‌ర్గానికి చెందిన నేత‌లు రంగంలోకి దిగిపోయి మాట‌ల తూటాలు విసిరేవారు.

అలాంటిది ఇప్పుడు చంద్ర‌బాబు అసెంబ్లీ సాక్షిగా క‌న్నీళ్లు పెట్టుకున్నా వారు పెద్ద‌గా నోరు మెద‌ప‌లేదు.

అదే విధంగా ఇదే ఘ‌ట‌న‌పై కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం ఓ లేఖ రాసి చంద్ర‌బాబును తీవ్రంగా విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న‌పై మండిప‌డ్డారు.త‌న‌ను అవ‌మానించిన‌ప్పుడు, ఇబ్బందులు పెట్టిన‌ప్పుడు మీకు ప‌రువు అనేది గుర్తుకు రాలేదా అంటూ మండిప‌డ్డారు.

"""/"/ అయితే కాపు వ‌ర్గానికి చెందిన నేత‌లు ప‌ద్మ‌నాభం వ్యాఖ్య‌ల మీద ఎలాంటి కామెంట్లు చేయ‌కుండా సైలెంట్ గా ఉండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యాన‌కి గురి చేస్తోంది.

టీడీపీలో ఇప్ప‌టికీ బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న ఏ ఒక్క ఏ కాపు నేత కూడా రియాక్టు కాక‌పోవ‌డం చర్చనీయాంశంగా మారింద‌నే చెప్పాలి.

నిజానికి ఓ వ‌ర్గం నేత‌లు త‌మ అధినేత‌ను విమ‌ర్శించినప్పుడు ఆ పార్టీలో ఉండే ఆ వ‌ర్గానికి చెందిన నేత‌లే స‌మాధానం ఇవ్వ‌డం ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న సంప్ర‌దాయం.

కానీ ఇప్పుడు చంద్ర‌బాబుకు కాపు నేత‌లు షాక్ ఇవ్వ‌డం చూస్తుంటే రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయో అర్థం అవుతోంది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!