ఎన్టీయార్ పక్కన ఆ బాలీవుడ్ బ్యూటీ..?

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో( RRR Movie ) మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీయార్ ( Jr NTR ) ప్రస్తుతం కొరటాల శివ( Koratala Siva ) కాంబినేషన్ లో దేవర ( Devara Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఎన్టీయార్ అంటే మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో.ఎన్టీయార్ అంటే ముఖ్యంగా అందరికీ గుర్తుకు వచ్చేది అతని డాన్స్.

ఆయన డాన్స్ అంటే ఫ్యాన్స్ పడిచచ్చిపోతారు.అలాంటి ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే ఇక ఫ్యాన్స్ కి పండగే.

"""/" / ఇక అసలు సంగతేంటి అంటే ఎన్టీఆర్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neil ) ఒక కథ రాసాడని తెలుస్తుంది.

ఐతే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

మరోపక్క ఈ సినిమా గురించి ఏదొక రూమర్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది.

తాజాగా మరో కొత్త రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దీపికా పదుకొనె నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇక అంతకు ముందు ఎన్టీయార్ కి జోడీ గా అలియ భట్ నటిస్తుంది అంటూ పుకార్లు పుట్టించారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ మళ్ళీ వార్తలు జోరుగా సాగుతున్నాయి.

"""/" / అయితే నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు.

కాకపోతే.ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని మాత్రం తెలుస్తుంది.

అందుకే ఆ పాత్రలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె నటిస్తే బాగుంటుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

ఇక ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాసినట్లు సమాచారం.

ఈ సినిమా ఇండియా – పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంట గా దీపిక పడుకొనే ని ఫిక్స్ చేస్తారా లేక ఇంకెవరినైనా పెడతారా అనేది తెలియాలంటే ఫిలిం మేకర్స్ నుంచి అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

వైరల్ వీడియో: కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పక్కనే ఉండి..?