చంద్రబాబు అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్… మంచి మైలేజ్ అంటూ?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్ స్కాంలో అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం చర్చలకు కారణం అవుతుంది.

ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోని సినిమా సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.సినీ నటుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ( Tammareddy Bharadwaj ) సైతం చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంపై స్పందించి తన అభిప్రాయాలను తెలియజేశారు.

"""/" / రాజకీయ నాయకులు ఇలా అరెస్టు( Political Leaders Arrest ) కావడం సర్వసాధారణమని ఈయన తెలియజేశారు.

ఇదివరకు ఎంతోమంది ప్రముఖ రాజకీయ నాయకులు అరెస్ట్ అయిన విషయాన్ని ఈయన గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ ఇది కాస్త సీరియస్ విషయమేనని తెలిపారు.

అయితే జైలుకు వెళ్లినంత మాత్రాన ఎవరు అవమానంగా ఫీల్ కావాల్సిన పనిలేదని, జగన్మోహన్ రెడ్డి( YS Jagan ) కూడా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సీఎం అయ్యారు అంటూ ఈయన తెలియచేశారు.

మన పైకి వచ్చినటువంటి ఆరోపణలను ఎదుర్కొని అవి నిరూపితం కాదని రుజువు చేసుకొని బయటకు రావాలని ఈయన తెలిపారు.

"""/" / ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో వైఎస్ఆర్సిపి పార్టీ( YSRCP ) నేతల కళ్ళల్లో ఆనందం తప్ప ఒరిగింది ఏమీ లేదని తెలిపారు.

అంతేకాకుండా త్వరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రచారం చేయాల్సిన పని లేకుండా, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా టీవీలలో చంద్రబాబునాయుడు అరెస్టు గురించి తెలియజేయడంతో ఆయనకు బోలెడంత మైలేజీ వస్తుందని, న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రజలలో చంద్రబాబుపై సానుభూతి పెరుగుతుందని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

ఇలా చంద్రబాబు నాయుడు అరెస్టు( Chandrababu Arrest ) కావడం తన పార్టీకే మంచి జరుగుతుంది అంటూ తమ్మారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

మందులతో అవసరం లేకుండా జలుబు, దగ్గు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టండిలా!