అసలేంటీ తమిళగం లొల్లి..?

తమిళ నాడులో గవర్నర్ ఆర్ఎన్ రవికి.ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారు అయింది.

తమిళులకు ఆది నుంచి తమ సంప్రదాయాలు అన్నా, భాషా అన్నా.వ్యవహారలు అన్నా అమితమైన ప్రేమ ఉంటుంది.

తమ వేషబాశల జోలికి ఎవరు వచ్చినా.అంతా ఏకమై స్పందిస్తారు.

ఇప్పుడు తమిళ నాట అదే నడుస్తోంది.కేవళం తమిళనాడు పేరును గవర్నర్ తన ప్రసంగంలో.

తమిళగం అని చదివినందుకు యావత్ తమిళనాడు భగ్గుమంటోంది.నిజానికి ప్రభుత్వం రాసిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదవడం ఆనవాయితిగా వస్తోంది.

కొన్ని సార్లు మౌళికమైన అంశాలను ప్రభుత్వం మరిచిపోయినప్పుడు గవర్నర్ వాటిని సరిచేయవచ్చు.తమిళ నాడు అనే పదం.

ప్రత్యేక దేశాన్ని సూచిస్తోందని.అందుకే ప్రదేశ్ అనే మీనింగ్ వచ్చేలా తమిళగం అనే పదాన్ని వాడానని గవర్నర్ చెబుతున్నారు.

అంతేకాకుండా ప్రసంగ పాఠాన్ని కొన్ని చోట్ల పేరాలను వదిలేసి చదివారని ప్రభుత్వం వాదిస్తోంది.

"""/"/ గవర్నర్ ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చరాదని.కేవలం ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠాన్నే చేర్చాలని స్టాలిన్ ప్రభుత్వం తీర్మానం చేసి ఆమోదం తెలిపింది.

దాంతో అవమానంగా భావించిన గవర్నర్ రవి.సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

గవర్నర్ తీరుపై యావత్ తమిళనాడు నిరసనలకు దిగింది.కేంద్ర ప్రభుత్వం కావాలనే తమిళులపై తమ సంప్రదాయాన్ని రుద్దాలని చూస్తోదని మండిపడుతున్నారు.

గవర్నర్ ను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. """/"/ అయితే గవర్నర్ బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.

నిజానికి తమిళనాడులో అన్నామలై అధ్యక్షుడు అయ్యాక పార్టీ ఫామ్ లోకి వచ్చింది.ఇప్పుడు అన్నామళైకు తోడు గవర్నర్ నిలవడంతో.

అటు డీఎంకే, ఇటు అన్నా డీఎంకేలు తట్టుకోలేక పోతున్నాయని విమర్శకులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్16, శనివారం 2024