పిల్లల్ని కనడం పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా… కన్న ప్రేమ గుర్తుందంటూ?

సినీ నటి తమన్నా( Tamannaah ) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇలా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న తమన్నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma) తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 అనే సిరీస్ లో నటించారు ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు.

"""/" / ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట వారి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతూ ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా వెళ్లడంతో వీరి రిలేషన్ కి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి.

అయితే వీరి రిలేషన్ గురించి ఒకానొక సమయంలో ఇద్దరు ఓపెన్ అయ్యారు.ఇలా రిలేషన్ లో ఉన్నామని తెలియచేయడంతో వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

"""/" / తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా పిల్లల్ని ( Kids ) కనడం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చిన్న పిల్లల్ని కనడం అనే అంశం ఎంతో ప్రత్యేకమైందని, వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం వారితోనే కలిసి ఉండడం వంటివి ఇలా చాలానే చెయ్యాల్సి ఉంటుందని తెలిపారు.

చిన్నప్పుడు అమ్మానాన్నలు నన్ను ఎంతో గారాభం చేశారు.ఆ కన్న ప్రేమ ఎలాగ ఉంటుందో నాకు తెలుసు.

మరి ఇప్పుడు పిల్లలు కావాలి అంటే ఆ ఫీలింగే మరోరకంగా ఉందని అందుకే పిల్లలను కనడం అనే అంశం నాకు కొంచెం భయంగానే ఉంటుందని తమన్నా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 .

మధుమేహులే కాదు సపోటా పండ్లు వారు కూడా తినకూడదని మీకు తెలుసా..?