ప్రియుడు విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిన తమన్నా… సోషల్ మీడియా ఫోటోలు డిలీట్?
TeluguStop.com
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి తమన్న (Thamanna)ఒకరు.
ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటూ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తమన్నా గత రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో(Vijay Varma) ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టారు.
వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2(Lust Stories 2) సిరీస్ లో నటించారు.
"""/" /
ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తమన్నా తన ప్రేమ గురించి వెల్లడించారు.
ఇక ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ జంటగా కలిసి వెళ్లడంతో త్వరలోనే వీరిద్దరూ శుభవార్తను చెప్పబోతున్నారు అంటూ అభిమానులు భావించారు.
ఇలా తమ పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా వీరిద్దరూ తమ లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తూ గడిపారు.
ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ బ్రేకప్ (Braek Up)చెప్పుకున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
"""/" /
తమన్నా తన ప్రియుడు విజయవర్మకు బ్రేకప్ చెప్పేసారని అందుకే ఈమె తన ఇంస్టాగ్రామ్ లో తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేశారు.
ఇలా పెళ్లి చేసుకుంటారని భావించిన అభిమానులకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని పెద్ద షాక్ ఇచ్చారని తెలుస్తోంది.
అయితే వీరిద్దరూ కూడా అధికారకంగా విడిపోయినట్లు ఎక్కడ తెలియజేయకపోయినా వీరిద్దరూ మాత్రం బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది.
అయితే బ్రేకప్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే తమన్నా లేదా విజయవర్మ ఈ వార్తలపై స్పందించాల్సిన ఉంది.
ప్రస్తుతం వీరిద్దరూ వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు
.