వకీల్ సాబ్ పై అభిమానాన్ని చూపించిన థమన్..వీడియో వైరల్!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ థమన్ ఒకరు.ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్న దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.

ఈయన ప్రెసెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.అయితే తాజాగా నిన్న థమన్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసాడు.

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంతకీ ఈయన షేర్ చేసిన వీడియో ఏమిటో తెలుసు కోవాలి అనుకుంటున్నారా.

థమన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వీడియో షేర్ చేసాడు.

ఈ వీడియో షేర్ చేసి పవర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటు కున్నాడు.

థమన్ విమానంలో ప్రయాణిస్తూ వకీల్ సాబ్ సినిమాను చూస్తున్నాడట.ఈ విషయాన్నీ వీడియో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.

37000 అడుగుల ఎత్తులో గాలిలో ప్రయాణం చేస్తూ వకీల్ సాబ్ చుస్తున్నానంటూ మానిటర్ లో ప్లే అవుతున్న పద పద పాటను చూస్తూ తాను కూడా పాట పాడుతూ ఉన్న వీడియోను షేర్ చేసాడు.

అంతేకాదు వకీల్ సాబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ నవంబర్ 16న విడుదల అవ్వబోతున్నాయని తెలిపాడు.

ఇక ప్రెసెంట్ థమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

"""/"/ ఈ సినిమా ప్రెసెంట్ బార్సిలోనా లో పాటల షూటింగ్ జరుపు కుంటుంది.

థమన్ కూడా అక్కడే పాటల షూటింగ్ లో టీమ్ తో కలిసి పాల్గొన్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు థమన్ బాలయ్య అఖండ సినిమాకు కూడా సంగీతం అందించాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు పవన్ భీమ్లా నాయక్ సినిమా కోసం కూడా సంగీతం అందిస్తున్నాడు.

ధనుష్ కొత్త టార్గెట్ ఏంటి అంటే..?