భీమ్లా నాయక్ పై థమన్ ట్వీట్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఉండే హంగామా అందరికి తెలిసిందే.

ప్రస్తుతం సాగర్ చంద్ర డైరక్షన్ లో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు పవర్ స్టార్.

ఈ సినిమాలో రానా కూడా మరో హీరోగా నటిస్తున్నారు.ఇప్పటికే థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి విపరీతమైన హైప్ తీసుకు రాగా లేటెస్ట్ గా థమన్ తన సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ కుమ్మేస్తాడని అంటూ కామెంట్ పెట్టాడు.

ఈ ఒక్క కామెంట్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.వెంటనే ఈ మెసేజ్ కి కామెంట్స్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు.

ఈ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న థమన్ భీమ్లా నాయక్ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.

భీమ్లా నాయక్ సినిమా మళయాళ సినిమా అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తుంది.

సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా థమన్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు.

రాధే శ్యాంకి బిజిఎం కూడా థమన్ అందిస్తుండటం విశేషం.

జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో అన్యాయం.. ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్ వైరల్!