‘బ్రో’ ఫస్ట్ సాంగ్ కోసం నిద్రమానేసి మరీ కష్ట పడ్డానంటున్న థమన్!

మెగా మల్టీ స్టారర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ జులై లోనే రాబోతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్( Mega Fans ) ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాపై వరుస అప్డేట్ లను అందిస్తూ మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నారు.

దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాను వెండితెర మీద చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు.

ఇంతకీ ఈ సినిమా ఏంటో అందరికి అర్ధం అయ్యే ఉంటుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''బ్రో ది అవతార్''( Brow The Avatar ).

ఈ సినిమా కోసమే మెగా ఫ్యాన్స్ ఆతృతగా అంతకంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

"""/" / ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ నుండి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.

ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.సముద్రఖని( Samudrakhani ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై టీజర్ తోనే అంచనాలు పెంచేయగా ఇప్పుడు మ్యూజికల్ గా అలరించడానికి సిద్ధం అవుతున్నారు.

ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ తో ప్రకటించారు.

"""/" / ''మై డియర్ మార్కండేయ''( My Dear Markandeya ) అనే సాంగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

మరి ఈ సాంగ్ విషయంలోనే థమన్ తాజాగా ఒక పోస్ట్ చేసారు.ఈ సాంగ్ కోసం థమన్ నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు.

సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్స్ సమయంలో మాకు నిద్ర అనేది చాలా తక్కువుగా దొరుకుతుంది అని ఏది ఏమైనా బ్రో మొదటి సాంగ్ ను ఎంజాయ్ చేద్దాం అంటూ రిప్లై ఇచ్చాడు.

ఈ రిప్లై ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఈరోజు పొగిడిన నోళ్లే రేపు తిడతాయి.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!