నా కడుపు నింపిన మనిషి బాలకృష్ణ.. బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా థమన్ ఏమన్నారంటే?

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్( Thaman ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు థమన్.

అంతేకాకుండా టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజీయస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నారు.ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా థమన్ చేతిలోనే ఉన్నాయి.

ఒక పక్క కాపీ ట్యూన్స్ అంటూ విమర్శిస్తూనే, ఇంకోపక్క థమన్ బీజీఎమ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఇక ఏ హీరోకు ఎలా ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ సినిమాకు థమన్ ఇచ్చే మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.

"""/" / అఖండ, వీరసింహారెడ్డి ఇప్పుడు భగవంత్ కేసరి.అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.అందులో భాగంగానే తాజాగా హైదరాబాదులో గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో థమన్, బాలకృష్ణ( Balakrishna ) గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ.కొన్ని సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ తో ఆడుతాయి.

గొప్ప ఎనర్జీ ఇస్తాయి.భగవంత్ కేసరి కూడా అలాంటి సినిమానే.

సినిమా అంతా అద్భుతంగా ఉంది. """/" / దర్శకుడు అనిల్ తన వెన్నెముక నాకు కూడా అతికించారు.

నిర్మాతలు చాలా కూల్ గా ఉంటారు.అనిల్ అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు.

తను మంచి లైఫ్ ఉన్న ఫిల్మ్ ఇచ్చాడు.ఇందులో పని చేసిన అందరూ దానికి ఆక్సిజన్ నింపారు.

అందుకే ఈ సినిమా ఈ రోజు ఇంత అద్భుతంగా వచ్చింది.యూనిట్ అంతా ఇంత ఆనందంగా ఉంది.

శ్రీలీల కంప్లీట్ యాక్టర్ అద్భుతంగా నటించింది.తనకి ఈ సినిమా మరింత పేరు తీసుకొస్తుంది.

నా మొదటి జీతం బాలకృష్ణ గారి సినిమా అదే భైరవద్వీపం నుంచే తీసుకున్నాను.

నా తొమ్మిదేళ్ళ వయసులో ఆయన సినిమాకి పని చేశాను.నాకు కడుపు నింపిన మనిషిగా బాలకృష్ణ గారితో ఎంతో అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్ లో రాబోతున్న త్రీక్వెల్ సినిమాస్ ఇవే..?!