‘ బ్రో’పై థమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇక నుండి వరుస ట్రీట్స్!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''బ్రో''.
మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరుస అప్డేట్ లను అందిస్తూ మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నారు.
దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాను వెండితెర మీద చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు.
ఈ నెలలోనే గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ నుండి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.
ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై టీజర్ తోనే అంచనాలు పెంచేయగా ఇప్పుడు మ్యూజికల్ గా అలరించడానికి సిద్ధం అవుతున్నారు.
"""/" /
ఈ విషయం పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ( Thaman ) ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు.
బ్రో ప్రమోషన్స్ థమన్ కారణంగానే లేట్ అవుతున్నాయి అనే ఆరోపణలు ఎదుర్కుంటున్న తరుణంలో థమన్ నుండి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది.
''బ్రో మంత్ వచ్చేసింది.ఇక నుండి వరుస అప్డేట్స్ ఉంటాయని'' ప్రామిస్ చేసాడు.
దీంతో ఇక బ్రో ట్రీట్ స్టార్ట్ అయినట్టే అని చెప్పాలి. """/" /
ఇక ప్రియా ప్రకాష్ వారియర్ ( Priya Prakash Varrier ) కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
కాగా ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.
వారాహి యాత్ర చేస్తూ ఏపీలో చాలా ప్రాంతాలను చుట్టేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈయన నటించిన బ్రో సినిమా రిలీజ్ కూడా ఉండడంతో ముందు ముందు ప్రమోషన్స్ కోసం సమయం కేటాయిస్తారా లేదా అని కూడా ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
చూడాలి పవన్ ఏం చేయబోతున్నాడో.
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!